అహ్మదాబాద్ కోవిడ్ ఆసుపత్రి మంటలు.. 8 మంది రోగులు మృతి.

గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనితో 8 మంది రోగులు ప్రాణాలు కోల్పోగా..గుజరాత్‌ రాజధాని అహ్మదాబాద్‌లోని కోవిడ్ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనితో 8 మంది రోగులు ప్రాణాలు కోల్పోగా.. మరో 35 మంది రోగులు గాయాలపాలయ్యారు. అహ్మదాబాద్‌లోని నవరంగపురలో ఉన్న శ్రేయ్ హాస్పిటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుంచి ఇవాళ తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.అవి ఇతర బ్లాకులకు కూడా వ్యాపించడంతో ఎనిమిది మంది రోగులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో గాయాలపాలైన మరో 35 మంది బాధితులను వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ఇక అహ్మదాబాద్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో శ్రేయ్ ఆసుపత్రిని కరోనా బాధితులకు చికిత్సను అందించడం కోసం కోవిడ్ ఆసుపత్రిగా మార్చారు. కాగా, అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణం తెలియాల్సి ఉండగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.