జూ కీపర్‌పై దాడి చేసిన భారీ మొసలి

జూ కీపర్‌పై దాడి చేసిన భారీ మొసలి

0
TMedia (Telugu News) :

జూ కీపర్‌పై దాడి చేసిన భారీ మొసలి

టీ మీడియా సెప్టెంబర్ 22, సౌతాఫ్రికా: ‘ఈ దేశం మొత్తంలో ఈ మొసలి మీద మాత్రమే నేను కూర్చోగలను’ అని చెప్పాడా జూకీపర్. ఆ మాటలు అలా ముగిశాయో లేదో.. అతను కూర్చున్న మొసలి టక్కున పక్కకు తిరిగి అతనిపై దాడి చేసింది. ఆ జూ కీపర్ తొడను గట్టిగా పట్టేసి విసిరి కొట్టింది. ఈ ఘటన సౌతాఫ్రికాలోని క్వాజులూ నాటల్ ప్రావిన్స్‌లో వెలుగు చూసింది. ఇక్కడి క్రోకోడైల్ క్రీక్‌లో షాన్ లె క్లాస్ అనే వ్యక్తి మొసళ్లను చూసుకుంటూ ఉంటాడు.అతను పెంచిన ఒక మొసలి పేరు ‘హానిబల్’. 16 అడుగుల పొడవుండే ఈ మొసలి 660 కేజీల బరువు ఉంటుంది. ఈ నెల 10వ తేదీన టూరిస్టులకు ఆ మొసలిని షాన్ పరిచయం చేశాడు. ఈ సమయంలో హానిబల్ పక్కనే మరో ఆడ మొసలి కూడా ఉంది. హానిబల్‌పై షాన్ కూర్చొని ఉండటం చూసిన అది అతని వైపు రాసాగింది. అది గమనించిన షాన్.. ‘ఈ ఆఫ్రికా మొత్తంలో దీనిపై మాత్రమే నేను ఇలా కూర్చోగలను’ అంటూ టక్కున పక్కకు వచ్చేందుకు ప్రయత్నించాడు.

 

Also Read : విద్య, విజ్ఞానానికి మించిన సంపద మరొకటి లేదు

 

అలా షాన్ తన వీపు మీద నుంచి దిగగానే పక్కకు తిరిగిన హానిబల్.. అతన్ని కాలును గట్టిగా పట్టుకొని పక్కకు విసిరేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. సుమారు 30 ఏళ్లుగా ఈ మొసలి బాగోగులు చూసుకుంటున్నాడు షాన్. ఈ ప్రమాదం తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని జూ నిర్వాహకులు అంటున్నారు. పక్కనే ఉన్న ఆడ మొసలి వల్లనే హానిబల్ ఇలా ప్రవర్తించి ఉంటాడని భావిస్తున్నారు.షాన్‌కు ఎలాంటి ప్రమాదం లేదని కూడా నిర్వాహకులు తెలిపారు. అతని కాలిపై రెండు దంతాల గాయాలు అయ్యాయని, అయితే తనకు తనే వాటిని కుట్టేసుకున్న షాన్.. 20 నిమిషాల తర్వాత మళ్లీ పనిలోకి వచ్చేశాడని చెప్పారు. గతంలో కూడా ఒకసారి ఇలాగే షాన్‌పై ఒక మొసలి దాడి చేసింది. దీంతో అతను 11 నెలలపాటు కుంటుకుంటూ నడవాల్సి వచ్చిందని సమాచారం. అలాగే హానిబల్ ఇలా మనుషులపై దాడి చేయడం కూడా ఇదే తొలిసారి అని తెలుస్తోంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube