మహాలక్ష్మీ వధువులకు 10 గ్రాముల బంగారం
-కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్‌బాబు
టీ మీడియా, అక్టోబర్ 17,హైదరాబాద్ : తెలంగాణాలో వచ్చే నెల నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి మొదలైంది. ఈ ఎన్నికల పోరులో గెలుపొందాలని ఒక పార్టీకి మించి మరొకపార్టీ పోటీపడుతున్నాయి. కర్ణాటకలో గెలుపొందిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ తెలంగాణలో గెలుపొందాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక ఫార్ములానే తెలంగాణాలోనూ మహిళా ఓటర్లనే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను రూపొందించనుంది. గతంలో కెసిఆర్ వధువులకు ఉపయోగకరంగా ‘కల్యాణ లక్ష్మీ’ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం పేరు మార్చి ‘మహాలక్ష్మీ’ స్కీంగా కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో చేర్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పథకం కింద వధువుకు 10 గ్రామలు బంగారం, అలాగే వధువు కుటుంబానికి లక్ష రూపాయల్ని అందజేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ శ్రీధర్‌బాబు మంగళవారం తెలిపారు.
Also Read : సిసోడియా కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
అయితే ఈ సిఫార్సు ఫైనల్ కాదని.. ఈ హామీ అమలుపై పిసిసి, ఎఐసిసి తీసుకున్న నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని శ్రీధర్‌బాబు అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ‘మహాలక్ష్మీ’ పథకం కింద మహిళలకు నెలకు రూ.2,500, రూ.500లకే ఎల్‌పిజి సిలిండర్, మహిళలకు ఉచిత ఉచిత బస్సు ప్రయాణం వంటి హామీలనిచ్చింది.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube