10 లక్షల ఉద్యోగాలు… మోదీ కీలక ఆదేశాలు

10 లక్షల ఉద్యోగాలు... మోదీ కీలక ఆదేశాలు

1
TMedia (Telugu News) :

10 లక్షల ఉద్యోగాలు… మోదీ కీలక ఆదేశాలు
టి మీడియా, జూన్14,దిల్లీ:దేశవ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని ప్రధాని నరేంద్రమోదీ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల నియామకాలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.

Also Read : గంజాయి మత్తు.. మెహదీపట్నంలో యువకుల వీరంగం

ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంఓ) మంగళవారం ట్వీట్ చేసింది.అన్ని ప్రభుత్వ శాఖల్లో మానవనరుల స్థితిగతులను సమీక్షించిన మీదట మోదీ నుంచి ఈ కీలక ప్రకటన వచ్చింది. ‘ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో మానవవనరుల స్థితిగతులను ప్రధాని మోదీ సమీక్షించారు. అనంతరం 10 లక్షల నియామకాలపై ఆదేశాలు ఇచ్చారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో ఈ పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయాలని ప్రభుత్వ శాఖలకు దిశానిర్దేశం చేశారు’ అని పీఎంఓ పోస్టు పెట్టింది.

Also Read : షీ టీమ్స్ ను అభినందించిన సీపీ

దేశంలోని నిరుద్యోగ సమస్యపై విపక్షాలు తరచూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుంటాయి. ప్రభుత్వ రంగంలో వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల గురించి కేంద్రం దృష్టికి తీసుకువస్తుంటాయి. ఈ క్రమంలోనే ఉద్యోగ నియామకాలపై తాజా ఆదేశాలు వచ్చాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube