మణుగూరు లో100 సి సి కెమెరాలు ఏర్పాటు .

0
TMedia (Telugu News) :

టి మీడియా, డిసెంబర్31, మణుగూరు .

మణుగూరు లో జరిగే నేరాలను , అక్రమాలను … అదుపుచేయడం కోసమే 100 సీసీ కెమెరాలను పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని మణుగూరు ఏఎస్పీ డాక్టర్ శబరిష్ పేర్కొన్నారు . ఏఎస్పీ కార్యాలయంలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్ , సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ నేతృత్వంలో పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు . అనంతరం సీసీ కెమెరాల స్క్రీన్లను ప్రారంభించారు .ఈసందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ .. మణుగూరు మండలంలో జరిగే నేరాలను అదుపుచేయడం కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు . సర్కిల్ ఇన్స్పెక్టర్ ముత్యం రమేష్ , సబ్ ఇన్స్పెక్టర్ నరేష్ ఇద్దరు కలిసి 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంలో ఎంతో హార్డ్ వర్క్ చేశారని, ఒక్క సీసీ కెమెరా 100 మంది కానిస్టేబుల్స్ సమానమని తెలిపారు .సి సి కెమెరా నేరాలను , అక్రమాలను అదుపు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని , ఇక నుంచి మణుగూరు ప్రాంతం మొత్తం సీసీ కెమెరాల నిఘాలో ఉంటుందని తెలియజేశారు .

100 cc cameras set up in Manuguru

అలాగే ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు . లేనిచో కెమెరా ద్వారా ఫైన్ వేయడం జరుగుతుందన్నారు . త్రిబుల్ డ్రైవింగ్ పై కూడా నిఘా ఎక్కువగా పెట్టామన్నారు . ప్రజలకు ఏ ఇబ్బందులు జరిగిన పోలీస్ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు . అలాగే 2022 న్యూ ఇయర్ వేడుకలను కరోనా నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని తెలిపారు.

100 cc cameras set up in Manuguru
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube