100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక
టి మీడియా, మార్చి 1, భద్రాచలం : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భద్రాచలo శాసనసభ్యులు,జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు “పొదెం వీరయ్య సమక్షంలో భద్రాచలo మండలానికి సంబంధించిన వివిధ పార్టీల నుంచి 100 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా శాసనసభ్యులు వీరయ్య మాట్లాడుతూ బిజెపి బిఆర్ఎస్ ప్రభుత్వ దొర పరిపాలనతో విసిగి వేసారిన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుంది కాబట్టే,కాంగ్రెస్ పార్టీలోకి ఇంతమంది చేరుతున్నారని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన పోరాడుతుందని రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సరెళ్ళ నరేష్, టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్,మాజీ గ్రంథాలయ చైర్మన్ భోగాల శ్రీనివాస్ రెడ్డి,సరెళ్ళ వెంకటేష్ యూత్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు చింతిరెల సుధీర్,యూత్ కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడారి ప్రదీప్,రాస మల్ల రాము,రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.