100 కేజీల గంజాయి దహనం

100 కేజీల గంజాయి దహనం

1
TMedia (Telugu News) :

100 కేజీల గంజాయి దహనం
టి మీడియా,ఏప్రిల్ 22,రామగుండం ;పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జిల్లా లో 2021 సంవత్సరం నుండి ఇప్పటివరకు నమోదైన 10 కేసులలో  గౌరవ కోర్టు వారి పర్మిషన్ తో రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ అధికారి ఆదేశాల మేరకు పెద్దపల్లి డి సి పి రవీందర్ ఆధ్వర్యంలో  సీజ్ చేసిన సుమారు 100  కిలోల గంజాయిని గురువారం  బసంత్ నగర్ కేశోరాం సిమెంట్ ఫ్యాక్టరీ  కొలిమి లో కాల్చి వేయడం జరిగింది.ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ గంజాయి రవాణా, సాగుకు,వినయోగం కి పాల్పడే వారి మూలాలను గుర్తించి వారి పట్టుకోవడం,గంజాయి రవాణాకు పాల్పడిన నిందితులపై పీడీయాక్ట్ లను నమోదు చేయడం జరుగుతుంది అన్నారు.గంజాయి నిందితుల నేరాలు కోర్టులో రుజువైయ్యే విధంగా నైపుణ్యంతో కూడిన దర్యాప్తుతో పాటు తగిన సాక్ష్యాధారాలను కోర్టులో ప్రవేశ పెట్టడం జరుగుతుంది అన్నారు.

Also Read : విద్యార్థికి ఆర్థిక సాయం

పాన్‌షాపుల్లో రోల్ పేపర్ అమ్మకాలకు పాల్పడే వారిపై కేసులను నమోదు చేస్తాం అన్నారు.ప్రతి పట్టణం,కాలనీ, గ్రామంలో కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు.తల్లిదండ్రులు,విద్యార్థులు, యువతపై దృష్టిసారించాలన్నారు.గంజాయి మత్తులో ఎలాంటి ప్రమాదాలకు పాల్పడతారో తెలియని పరిస్థితిలో ఉంటారన్నారు. అలాంటి వ్యక్తుల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి జిల్లా ప్రజలు సహకరించాలని సూచించారు గంజాయి మరే ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్ 100 కి గాని, స్థానిక పోలీస్ వారికి సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని మరియు వారికి నగదు పురస్కారం అందజేయడం జరుగుతుందని డీసీపీ తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో పెద్దపల్లి ఏసిపి సారంగపాణి, పెద్దపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్,కేసులు నమోదైన సంబంధిత పోలీస్ స్టేషన్ ల ఎస్ఐ లు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube