పదవ తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి

పదవ తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి

1
TMedia (Telugu News) :

పదవ తరగతి విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలి
టీ మీడియా, ఏప్రిల్ 7, జన్నారం:మే నెలలో జరగే 10వ తరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే మంచి మార్కులు తెచ్చుకో కలుగుతారని కామన్ పల్లి ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు దాముక కమలాకర్ విద్యార్థులకు సూచించారు గురువారం రోజున మండలంలోని కామన్ పెళ్లి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల యందు పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పదవతరగతి వార్షిక పరీక్షలకు ఎలా సిద్ధం కావాలో విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. గత రెండు సంవత్సరాల నుండి కరోనా వల్ల విద్యార్థులు చదువులకు మరియు పరీక్షలకు దూరమై చాలా ఇబ్బందులు పడ్డారని, కావున వచ్చేనెలలో జరిగే పదవ తరగతి పరీక్షలకు భయపడకుండా ఏకాగ్రతతో చదువుకోవాలని, వారిపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి మంచి మార్కులు సాధించేలా తోడ్పడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో లో పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ దుర్గయ్య, ఉపాధ్యాయులు ప్రకాష్ నాయక్,ఇందు మొగిలి, ప్రవీణ్ కుమార్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Also Read;అంబేద్కర్ విగ్రహాలకు రంగులు, మరమ్మతులు చేయించాలని జాయింట్ కలెక్టర్‌ కు వినతిపత్రం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube