100 ఎకరాల్లో పొంగులేటి కుమార్తె పెళ్లి రిసెప్షన్

1
TMedia (Telugu News) :

100 ఎకరాల్లో పొంగులేటి కుమార్తె పెళ్లి రిసెప్షన్

ponguleti

 

– దారి కోసం ఏకంగా రూ.కోటి వెచ్చించి బ్రిడ్జి నిర్మాణం*

–  వేదికకు బాహుబలి లాంటి సెట్టింగ్‌లతో నిర్మాణం*

టీ మీడియా ,ఆగస్ట్ 12, ఖమ్మం :జిల్లాలో ఇప్పుడు పెళ్లి సందడి నెలకొంది.ఇది మామూలు పెళ్లి కాదండోయ్‌.కోట్లాది రూపాయలు వెచ్చించి బాహుబలి రేంజ్‌లో చేస్తున్న సెట్టింగ్‌లు.ఇదంతా ఒక రేంజ్‌ అయితే మరి రిసెప్షన్‌ కోసం దారి కోసం ఏకంగా రూ.కోటి వెచ్చించి ఒక బ్రిడ్జిని నిర్మించారంటే పెళ్లి రిసెప్షన్‌ వేడుక ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటా ఇప్పుడు పెళ్లి సందడి నెలకొంది.అత్యంత వైభవంగా ఈ వేడుకను నిర్వహించేందుకు భారీగా ఖర్చు చేయడం,నెల రోజులుగా ఆహ్వానాలు,పెళ్లి గిప్ట్‌ల పేరుతో గోడ వాచీలను పంపిణీ చేయడంతో పొంగులేటి ఇంట జరిగే కుమార్తె వివాహంపై జనం దృష్టి పడింది.ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కుమార్తె స్వప్ని రెడ్డి రిసెప్షన్‌ ఈ నెల 17న ఖమ్మంలో నిర్వహించనున్నారు.అత్యంత భారీగా ఈ వివాహ రిసెప్షన్‌ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ రిసెప్షన్‌ వేడుక ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు యావత్తు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.వివాహ రిసెప్షన్‌ను ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌ సమీపంలో ఏర్పాటు చేశారు.ఈ వేదిక వద్దకు వెళ్లే మార్గంలో నాగార్జున సాగర్‌ డీప్‌ కట్‌ ఉంది.వేడుకకు వచ్చే వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని ఏకంగా ఈ కెనాల్‌ పై అత్యవసరంగా బ్రిడ్జిని నిర్మాణం చేశారు.ఐరన్‌తో ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి కేవలం నెల రోజుల్లోనే నిర్మాణం చేయడం విశేషం.ప్రస్తుతం వైఎస్సార్‌ కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న బ్రిడ్జితోపాటు ఈ బ్రిడ్జి నిర్మాణం వల్ల ఇన్‌ అవుట్‌ ప్రాతిపదికన మరో బ్రిడ్జి నిర్మాణం చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది.
రిసెప్షన్‌కు వంద ఎకరాలు వివాహ రిసెప్షన్‌ను ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ సమీపంలో వంద ఎకరాల్లో నిర్వహిస్తున్నారు.3 లక్షల మంది అతిధులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేసే విదంగా ఏర్పాటు చేయడం గమనార్హం. ఇందుకోసం మొత్తం 100 ఎకరాల్లో వివాహ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు.ఇందులో 30 ఎకరాల్లో రిసెప్షన్‌ వేదికతో పాటు పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు,వివాహ రిసెప్షన్‌ వేదికకు బాహుబలి లాంటి సెట్టింగ్‌లతో నిర్మాణం చేయడం గమనార్హం.వర్షాకాలం కావడంతో ప్రత్యేకంగా టెంపరరీ వాటర్‌ప్రూప్‌ షెడ్లను నిర్మాణం చేస్తున్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆది నుంచి సంచలనాలకు వేదికగా మారిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రస్తుతం తన కుమార్తె వివాహ రిసెప్షన్‌ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేయడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశంగా మారింది. దీంతోపాటు ఇప్పటికే ఈ వివాహ రిసెప్షన్‌కు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరుకానున్నట్లు ప్రచారం సాగుతుంది.మరి తెలంగాణ సీఎం రాకపై ఇప్పటి వరకు అధికారిక సమాచారం వెలువడలేదు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube