విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా ఫిబ్రవరి 13వ తారీఖున జైల్ బోరో కార్యక్రమం జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ జె అయోధ్య రామ్
అగనంపూడి సీడబ్ల్యూసీలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సంఘాలతో ఏర్పాటుచేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో జె అయోధ్య రామ్ ప్రసంగిస్తూ ఆంధ్ర రాష్ట్రానికి తలమానికమైన ఎంతోమంది త్యాగ ఫలితం తో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తావని ఆలోచన విరమింప చేసుకోవాలని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాది నుండి వివిధ రూపాల్లో గల్లీ నుండి ఢిల్లీ వరకు ఉద్యమాలు చేయడం జరుగుతుందని విశాఖ ఉత్పత్తులకు సరైన గనులు లేకపోయినప్పటికీ కరోనా టైమ్ లో కూడా కార్మికులు కష్టపడి లాభాల బాటలో నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తుంది కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా ఫిబ్రవరి 13వ తేదీ న జరిగే జైల్భరో కార్యక్రమాన్ని కి రాజకీయాలకతీతంగా ప్రజా సంఘాలు ,స్వచ్ఛందంగా పాల్గోవాలని పిలుపునిచ్చారు.
also read:మంచికి మారుపేరు మంచికంటి
ఏడిసి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారం ఆవిర్భవించి నాలుగు దశాబ్దాలు జరుగుతున్నప్పటికీ నిర్వాసితులకు సరైన న్యాయం జరగలేదని జైల్భరో కార్యక్రమం కి ఉక్కు నిర్వాసితుల అధిక సంఖ్యలో పాల్గొవాలని అన్నారు
స్థానిక వివిధ మహిళా సంఘ ప్రతినిధులు జే వి ఎల్ లక్ష్మి,, కర్రీ అప్పలనరసమ్మ , అమరపినినీ లావణ్య మాట్లాడుతూ స్థానికంగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆవిర్భావంతో విశాఖ జిల్లా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి ఎంతోమంది వచ్చే ఇక్కడ జీవనోపాధి చేస్తున్నారని విశాఖ ప్రవేటీకరణ ఉద్యమంలో ప్రాంతీయతత్వం లేకుండా అందరూ పాల్గోవాలని జైల్భరో కార్యక్రమానికి మహిళా సంఘాల తరఫున సంపూర్ణ మద్దతు పలికారు.
స్థానిక ఉక్కు అఖిలపక్ష సంఘ నాయకులు కరణం సత్యారావు కే పరంధామయ్య పెది రెడ్ల నీలకంఠం బుదిరెడ్డి అప్పారావు బొబ్బరి సూర్య ఉరిటి మారయ్య గంతకోరు అప్పారావు ఉప్పల కన్నారావు బీ కామేశ్వరరావు బలిరెడ్డి శ్రీను సి హెచ్ నర్సింగరావు లక్కరాజు రాము అగనంపూడి భవన కార్మికుల అధ్యక్షులు సాయిన అప్పారావు వర్తక సంఘం అధ్యక్షులు మయూరి బుజ్జి
లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి జాజుల సూరిరావు, టైలర్ ఓనర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధి తలారి శ్రీనివాసరావు ఉక్కు నిర్వాసితుల సంఘ ప్రతినిధి కరణం జగదీష్ వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు సర్వ శ్రీమతులు విందుల తులసి భాయ్, సాయిన పైడికొండ స్థానిక యూత్ నాయకులు కర్రీ వరప్రసాద్ మొల్లి కోటేశ్వరరావు నిర్వాసితులు పాల్గొన్నారు,
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube