14న రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ బంద్

14న రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ బంద్

1
TMedia (Telugu News) :

14న రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ బంద్
టి మీడియా,జులై9,హైదరాబాద్:
విద్యార్ధి వ్యతిరేక నూతన జాతీయ విద్యా విధానం ఎన్‌ఈపీ2020 ను రద్దు చేయాలని, విద్యారంగా సమస్యల పరిష్కారానికై ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, ఏఐడీఎస్‌ఓ, ఏఐపీఎస్‌యూ ఏఐఎఫ్‌డీఎస్, ఎఐఎస్‌బీ వామపక్ష విద్యార్ధి సంఘాలు జులై 14న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ మేరకు వామపక్ష విద్యార్థి సంఘాలు కలిసి ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యావ్యవస్థలో మార్పుల పేరుతో కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ, కేంద్రీకరణ, కాషాయికరణను ప్రోత్సహించే నూతన జాతీయ విద్యా విధానం 2020 ను తెచ్చిందని ఆరోపించారు.

Also Read : తుంగభద్రకు పోటెత్తిన వరద

రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉచితంగా బస్ పాసులు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌లు అందించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశాయి. కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను నియంత్రించాలని, మన ఊరు-మన బడి పథకంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను చేర్చి తక్షణమే సరిపడా నిధులు విడుదల చేయాలని, ఖాళీగా ఉన్న టీచర్ ఎంఈఓ, డీఈఓ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube