15 నుంచి ఒంటిపూట బడులు
టీ మీడియా, ఫిబ్రవరి 18, హైదరాబాద్ : మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని పాఠశాలలకు ఒక పూట బడి విధానాన్ని అమలుచేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో క్రమేపి ఎండల తీవ్రత పెరుగుతుండడంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా ఉండేంందుకు ఒంటిపూట బడులను ప్రారంభించాలని నిర్ణయించారు.
ఏప్రిల్ 23 నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు ఈ ఏడాది వేసవి సెలవులను ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యార్థులకు క్లాసులు నిర్వహించనున్నారు.
Also Read : ప్రత్యేక హోదాపై నిర్మలా సీతారామన్ సంచలన వ్యాఖ్యలు
అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని విద్యాశాఖ సూచించింది. అలాగే రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 12 వరకు జరుగుతాయి. మిగిలిన తరగతులకు ఏప్రిల్ 12 నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1-5 తరగతుల వారికి నాలుగు సబ్జెక్టులే ఉండడంతో వారికి ఏప్రిల్ 17తో పరీక్షలు ముగియనున్నాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube