కూలిన హెలికాప్టర్.. హోంశాఖ మంత్రితో పాటు 16 మంది మృతి
కూలిన హెలికాప్టర్.. హోంశాఖ మంత్రితో పాటు 16 మంది మృతి
కూలిన హెలికాప్టర్.. హోంశాఖ మంత్రితో పాటు 16 మంది మృతి
టీ మీడియా, జనవరి 18, కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో హెలికాప్టర్ కూలింది. ఆ ఘటనలో ఆ దేశ హోంశాఖ మంత్రి డెనిస్ మోనస్ట్రిస్కీతో పాటు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. హెలికాప్టర్ ప్రమాదానికి చెందిన వీడియో ఒకటి ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ప్రమాద సమయంలో అరుపులు, కేకలు వినిపించాయి. ఏ కారణం చేత ప్రమాదం జరిగిందో ఇంకా తెలియరాలేదు. బ్రోవర్ పట్టణంలో ఈ దుర్ఘటన జరిగింది.హెలికాప్టర్ ప్రమాదంలో 22 మంది గాయపడ్డారు. దాంట్లో పది మంది చిన్నారులు ఉన్నారు. గాయపడ్డవారిని సమీప ఆస్పత్రికి తరలించారు.
Also Read : కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేసిన ముఖ్యమంత్రులు
బ్రోవరీ పట్టణంలో ఉన్న కేజీ స్కూల్ వద్ద ఈ ఘటన జరిగింది. కీవ్‌కు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ పట్టణంలో లక్షా పది వేల మంది జనాభా ఉన్నారు. హోంశాఖ మంత్రి మోనస్ట్రిస్కీతో పాటు డిప్యూటీ మంత్రి ఎవ్జనీ యెనిన్, ఆ శాఖకు చెందిన ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube