16న ‘ఆవేకన్ వరంగల్’

మత్తు పదార్థాల నిరోధం, రోడ్డు భద్రతపై అవగాహన

1
TMedia (Telugu News) :

16న ‘ఆవేకన్ వరంగల్’

-మత్తు పదార్థాల నిరోధం, రోడ్డు భద్రతపై అవగాహన

టి మీడియా, మే14,హనుమకొండ బ్యూరో:మత్తు పదార్థాలు, రోడ్డు సేఫ్టీపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ‘అవైకన్‌ వరంగల్‌’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని వరంగల్‌ సీపీ తరుణ్‌జోషి వెల్లడించారు.
ఈ నెల 16న వరంగల్‌ కేఎంసీ మైదానంలో కార్యక్రమం జరుగనుందని వెల్లడించారు. వరంగల్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

 

Also Read : హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు. గంజాయి రహిత కమిషనరేటే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రజలను జాగృతం చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో జాతీయ, అంతర్జాతీయ మోడల్స్‌, పారా అథ్లెట్స్‌తో ర్యాంప్‌ వాక్‌ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి వరంగల్‌ ప్రజలు పెద్దఎత్తున హాజరుకావాలని సీపీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీసీపీలు అశోక్‌కుమార్‌, వెంకటలక్ష్మి, అదనపు డీసీపీ వైభవ్‌ గైక్వాడ్‌, హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube