1976-77 పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయసమ్మేళనం
టీ మీడియా, మార్చి 14,జగిత్యాల:కొడిమ్యాల మండల కేంద్రం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1976-1977 కు సంబంధించిన పదవతరగతి విద్యార్థుల ఆత్మీయసమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి రాగి కైలాసం,రిటైర్డ్ తెలుగు ఉపాధ్యాయులు ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాంపెల్లి మల్లేశం ముఖ్య అతిథులు గా హజరయ్యారు.ఈ సందర్భంగా కైలాసం మాట్లాడుతూ నేను బోధించిన విద్యార్థులు వివిధ రంగాలలో స్థిరపడి ఉన్నత ఉద్యోగులు అయి ఈ రోజు నన్ను ఆత్మీయంగా పిలిచి సన్మానించినందుకు నాకు సంతోషంగా ఉందన్నారు.ప్రధానోపాధ్యాయులు నాంపెల్లి మల్లేశం మాట్లాడుతూ ఇలాంటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకొని సుమారు 46 సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా అద్భుతమైన విషయం ఎల్లప్పుడు మేము పూర్వ విద్యార్థుల సమ్మెళనాలకు పూర్తి సహాయసహకారాలు ఉంటాయని తెలిపి 1976-1977 బ్యాచ్ తరపున పాఠశాల అబివృద్హికి కంప్యూటర్,సిపియు,ప్రింటర్ విరాళంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Also Read : లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
ఈ కార్యక్రమంలో గుడిరఘుపతి రెడ్డి,చిలువేరి నారాయణ,నాంపెల్లి రాజేశం మాజీ ఎంపిటిసి ,రాంగోపాల్ రావు రిటైర్డ్ అడిషనల్ డిఎస్పీ,మంచాల నర్సయ్య,బాల మురళీ కృష్ణ,మహేందర్ రావు,మంచాల రాజేందర్ బ్యాన్క్ ఆ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్,నరేందర్ గుండేటి,టి.హనుమంత రావు రిటర్డ్ డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఇంచార్జ్,జలీల్ రిటైర్డ్ ఇంజనీర్,సీహెచ్. వేణుగోపాల్,ఎస్. మహేందర్శారద,సరళ,మొదలగు 43 పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube