రూ. రెండు ల‌క్ష‌ల్లోపే ఈ దేశాల‌ను ఎంచ‌క్కా చుట్టిరావొచ్చు

రూ. రెండు ల‌క్ష‌ల్లోపే ఈ దేశాల‌ను ఎంచ‌క్కా చుట్టిరావొచ్చు

1
TMedia (Telugu News) :

రూ. రెండు ల‌క్ష‌ల్లోపే ఈ దేశాల‌ను ఎంచ‌క్కా చుట్టిరావొచ్చు
టి మీడియా,జూన్ 13, ఢిల్లీ: కరోనా కారణంగా రెండేండ్లు ఏ యాత్రా లేక విసిగిపోయిన పర్యాటకులకు వినోదాల వేళయింది. కొవిడ్‌ నిబంధనల పహారా మధ్య స్థానిక విహారాలు కానిచ్చినా.. కరోనా ఉధృతి ఉపశమించడం, వ్యాక్సిన్‌ రక్షణగా ఉండటంతో ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుంది’ అని రాగాలు తీస్తున్నారు. ఏ దేశమేగాలో ఆరాలు తీయకండి. రెండు లక్షల రూపాయల బడ్జెట్‌లో చుట్టివచ్చే చూడచక్కని దేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇవి కొన్ని..
వండర్‌ఫుల్‌ ఇండోనేషియా
హిందూ మహాసముద్రంపై తేలియాడే ఇండోనేషియా దాదాపు 17వేల దీవుల సమూహం. వీటిలో జనావాసం ఉన్న దీవులు కొన్నే అయినా, పర్యాటక ఆకర్షణలు ఉన్నవి మాత్రం కోకొల్లలు. బాలీ, లాంబక్‌, జావా, సుమత్రా, న్యూగినియా తదితర దీవులు సముద్ర క్రీడలకు అడ్డా

Also Read : ప్రాణం తీసిన అలలు..

అదిరే ఆస్ట్రియా
ఐరోపా ఖండంలో కడిగిన ముత్యంలా ఉంటుంది ఆస్ట్రియా. ఈ చిన్ని దేశం యాత్రికుల స్వర్గమే! ప్రతి నగరంలో చారిత్రక నిర్మాణాలు, అందమైన ఉద్యానవనాలు దర్శనమిస్తాయి. పురాతన చర్చీలు, వస్తు సంగ్రహాలయాలు యాత్రికులకు నాణ్యమైన కాలక్షేపాన్ని అందించి తీరతజోర్‌దార్‌ జోర్డాన్‌పశ్చిమ ఆసియాలోని ఎడారి దేశం జోర్డాన్‌. క్రీస్తు శకం 3వ శతాబ్దిలో పురుడుపోసుకున్న పెట్రా నగరంలో అడుగడుగునా అపురూప కట్టడాలు దర్శనమిస్తాయి. సుగంధ ద్రవ్యాలు అమ్మే వీధులు, భారీ పర్వతాలు.. ఇలా చెబుతూ పోతే జోర్‌దార్‌ పర్యటనకు కావాల్సిన అన్ని హంగులూ జోర్డాన్‌లో ఉన్నాయి.టర్కియే చుట్టేద్దాంఆసియా-యూరప్‌ ఖండాల్లో విస్తరించి ఉన్న దేశం టర్కియే. ఈ దేశ చారిత్రక రాజధాని ఇస్తాంబుల్‌ పర్యాటకులకు స్వర్గధామం. ముత్యపు చిప్పల్లా ఉన్న చిన్నిచిన్ని జలపాతాల సమూహం పాముక్కలే విహారం, క్యాపడోసియాలో హాట్‌ బెలూన్‌ రైడ్‌ జీవితాంతం గుర్తుండిపోతాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube