పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాల్లో 20.73 శాతం అర్హత..

పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాల్లో 20.73 శాతం అర్హత..

0
TMedia (Telugu News) :

పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాల్లో 20.73 శాతం అర్హత..

టీ మీడియా, ఫిబ్రవరి 6, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు దాదాపు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటి ఫలితాలు ఫిబ్రవరి 5న విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగున్నర లక్షల మంది పరీక్ష రాస్తేవారిలో కేవలం 95,209 మంది అంటే 20.73 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత పొందారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారిలో 77,876 మంది పురుషులు, 17,332 మంది మహిళలు ఉన్నారు. ఈ లెక్కన మొత్తం 6,100 పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల్లో ఒక్కో పోస్టుకు 16 మంది పోటీపడుతున్నారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారందరికీ త్వరలో పీఎంటీ, పీఈటీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తెలిపింది. వీరంతా స్టేజ్‌-2 పరీక్షల కోసం ఫిబ్రవరి 13 నుంచి 20 వరకు పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దేహదారుఢ్య పరీక్షల సమయంలోనే అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కూడా ఉంటుందని బోర్డు తెల్పింది.

Also Read : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్

సమాధానాల ‘కీ’కి సంబంధించి మొత్తం 2,261 అభ్యంతరాలు వచ్చాయని, వాటిలో మూడు ప్రశ్నల సమాధానాలను ‘కీ’లో మార్చినట్లు పోలీసు నియామక మండలి తెలిపింది. 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ సమాధానపత్రాల ఓఎంఆర్‌ షీట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. సందేహాలు ఉంటే 94414 50639, 91002 03323 నంబర్లలో సంప్రదించాలని సూచించింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube