అప్పులు చేసే రాష్ట్రాల్లో మన ర్యాంకు 28: సీఎం కేసీఆర్
అప్పులు చేసే రాష్ట్రాల్లో మన ర్యాంకు 28: సీఎం కేసీఆర్
అప్పులు చేసే రాష్ట్రాల్లో మన ర్యాంకు 28: సీఎం కేసీఆర్
టీ మీడియా, మార్చి 15,హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు
also read:కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం
సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బడ్జెట్ అంటే బ్రహ్మపదార్థం కాదని అన్నారు. బడ్జెట్ అంటే అంకెలు మాత్రమే చెబుతారన్న అపోహా ఉందని పేర్కొన్నారు. బడ్జెట్ అద్భుతమని అధికారపక్షం అంటే, బాగాలేదని ప్రతిపక్షం విమర్శిస్తుందన్నారు. బడ్జెట్ అనేది నిధుల కూర్పు అని తెలిపారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థ కూడ కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు దేశ తొలి బడ్జెట్ 190 కోట్లు అయితే అందులో 91 కోట్లు రక్షణకే కేటాయించినట్లు పేర్కొన్నారు.
also read:కేసీఆర్ అవసరం ఈ రాష్ట్రానికి ఎంతో ఉంది : అక్బరుద్దీన్ ఓవైసీ
అవినీతిని పూర్తిగా నిర్మిలించాం
ప్రభుత్వాలకు అప్పులు సహజమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు ఏపీ బడ్జెట్ రూ.680 కోట్లు ఉంటే ఇప్పుడేమో బడ్జెట్ లక్షల కోట్లకు చేరిందన్నారు ప్రజాస్వామ్య ప్రభుత్వానికి రెండే అధికారులు ఉంటాయన్న కేసీఆర్.. ఎవరికైనా ట్యాక్స్‌లు వేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చని తెలిపారు. కొత్త రాష్ట్రమైనా తెలంగాణ అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రశంసించారు. రాష్ట్రంలో అవినీతిని పూర్తిగా నిర్మిలించామని చెప్పారు.
also read:కొత్త కేంద్రీయ విద్యాలయాల (కేవీ) ఏర్పాటుపై చర్యలేవీ?
అప్పులనేది వనరుల సమీకరణ కింద భావిస్తామని. వనరుల సమీకరణలోనూ కఠోరమైన క్రమశిక్షణ పాటిస్తున్నామని తెలిపారు. అప్పులుచేసే రాష్ట్రాల్లో మన ర్యాంకు 28గా ఉందనిని సీఎం కేసీఆర్ తెలిపారు.
అందుకే భట్టిని పార్లమెంట్‌కు పంపాలనుకుంటున్నా
కేంద్రం విషయాలను ఇక్కడ సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క గట్టిగా మాట్లాడుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు.
also read:ట్యాంక్ ద్వారా ఇంటింటికి నీళ్ళు
అందుకే భట్టిని పార్లమెంట్‌కు పంపాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. మన ఊరు- మన బడి మంచిదని భట్టి చెప్పినట్లు తెలిపారు. భట్టికి ప్రమోషన్ ఇవ్వాలని తెలిపారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube