ఇంజినీరింగ్‌ విద్యార్థులకు రెండు వారాల వేసవి సెలవులు

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు రెండు వారాల వేసవి సెలవులు

1
TMedia (Telugu News) :

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు రెండు వారాల వేసవి సెలవులు

టి మీడియా,మే 8,హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ విద్యార్థులకు రెండు వారాలపాటు వేసవి సెలవులు ఇవ్వాలని జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి 29 వరకు సెలవులు ఇస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ ఆదేశాలు జారీ చేశారు. తిరిగి 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో తొలుత వేసవి సెలవులు లేకుండానే అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రకటించింది.

Also Read : ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణతో రాహుల్ సమావేశం

తాజాగా విద్యాసంవత్సరంలో జేఎన్‌టీయూ మార్పులు చేసింది. ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 30 నుంచి ప్రారంభమై వచ్చే నెల 11న ముగుస్తాయి. అదే నెల 13 నుంచి రెండో సెమిస్టర్‌ తరగతులు ప్రారంభించి.. పరీక్షలు ఆగస్టు 24 నుంచి నిర్వహిస్తారు. ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్‌ తరగతులు ఆగస్టు 17 నుంచి, మూడో ఏడాది రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు 26 నుంచి ప్రారంభమవుతాయి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube