త్రీ ఇన్ వన్ బిల్డింగ్ లో ఇబ్బందులు

త్రీ ఇన్ వన్ బిల్డింగ్ లో ఇబ్బందులు

1
TMedia (Telugu News) :

త్రీ ఇన్ వన్ బిల్డింగ్ లో ఇబ్బందులు

టి మీడియా,మర్చి 12,మధిర: పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఒకే భవనంలో ఆరోగ్య ,అంగనవాడి, ఆయుర్వేద కేంద్రాలను సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తుండడం తో అసౌకర్యంగా ఉందని అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎస్సీ కాలనీ వాటర్ ట్యాంక్ దగ్గర పార్క్ ఏరియాలో ని ఏర్పాటు చేసినటువంటి ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రము నందు ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యకలాపాలు ,అంగనవాడి కేంద్రం ,ప్రభుత్వ ఆయుర్వేద కేంద్రము సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించడం వల్ల ఇరుకైన భవనంలో వసతి సరిగా లేదని వివిధ టీకాల కు వచ్చేవారికి, అంగన్వాడి సెంటర్ లో బాలింతలు, గర్భిణీ స్త్రీలు, పిల్లలకు ఇబ్బందిగా ఉంది. దీనికి తోడు ఆవరణలోని ఉన్న సంపు నుండి నీరు రావడంతో ఆవరణ అంతా నిండిపోయి అక్కడికి వచ్చే పిల్లలకు, వైద్యం కోసం వచ్చే వారికి అసౌకర్యంగా ఉందని తెలియజేస్తున్నారు. ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీగా ఉండగా ప్రభుత్వ ఆయుర్వేద కేంద్రమును ఇదే ఇదే భావనను ఎందుకోసం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అనేది ప్రజల సందేహం. సంబంధిత అధికారులు స్పందించి ఒకే బిల్డింగ్ లో మూడు కేంద్రాలను నిర్వహించకుండా వీలైనంతగా ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

Also Read : ఆర్బిట్రేషన్‌ సెంటర్‌ ప్రపంచ ఖ్యాతి సాధించాలి: సీజేఐ ఎన్వీ రమణ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube