ఎమ్మెల్సీ నిధులతో కోటి 30 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు

1
TMedia (Telugu News) :

టి మీడియా, డిసెంబర్ 29 వెంకటాపురం:

ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల్లో రూ ఒక 1 కోటి 30 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు, ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ పాల్గొన్నారు. వెంకటాపురం మండల కేంద్రంలో రూ 50 లక్షల రూపాయలతో నిర్మించే కమ్యూనిటీ హాల్ కు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ నిధుల నుంచి ఈ నిధులను మంజూరు చేశారు బాలసాని లక్ష్మీనారాయణ పదవీ కాలం త్వరలో ముగియనున్న నందున టిఆర్ఎస్ నాయకులు వెంకటాపురం లో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు, శంకుస్థాపన కార్యక్రమాల అనంతరం వెంకటాపురం మండల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు,

ఈ సభలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పదవి ఉన్నా లేకున్నా ఎప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి  పాటుపడతానని అన్నారు, 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఎమ్మెల్సీ పదవి కాలం జనవరి 4న ముగియనున్న నందున వెంకటాపురం మండల కేంద్రంలో ఆత్మీయ సభ నిర్వహించారు, ఈ సభకు పలు గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రావడం జరిగింది,

ఈ కార్యక్రమంలో భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం  వెంకట్రావు మార్కెట్ కమిటీ చైర్మన్ బోదె  బోయినా బుచ్చయ్య జడ్పిటిసి పాయం  రమణ మండల అధ్యక్షులు గంప రాంబాబు కార్యదర్శి మురళి ఉపాధ్యక్షుడుగా గాందేర్ల నాగేశ్వరరావు అధికార ప్రతినిధి డర్రా దామోదర్ రెండు మండలాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube