భూకంపం వల్ల 30 మంది మృతి

-సునామీ హెచ్చరికల ఉపసంహరణ

0
TMedia (Telugu News) :

భూకంపం వల్ల 30 మంది మృతి

-సునామీ హెచ్చరికల ఉపసంహరణ

టీ మీడియా, జనవరి 2,టోక్యో : సోమవారం ప్రపంచమంతా న్యూఇయర్‌ వేడుకలు జరుగుతుంటే.. ఒక్క జపాన్‌లో మాత్రం విషాదం చోటుచేసుకుంది. కొత్త ఏడాది ప్రారంభం రోజునే 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. గంటల వ్యవధిలోనే తీవ్రస్థాయిలో భూప్రకంపనలు సంభవించడంతో వేలాది ఇళ్లు, ప్రధాన రహదారుల ధ్వంసమయ్యాయి. ఇక ఈ భూకంపం ఆరుగురు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మంగళవారం పోలీసులు వెల్లడించారు. ఇక వాజిమా ఓడరేవులో ఏడుగురితో సహా 24 మంది మరణించారని క్యోడో న్యూస్‌ ఏజెన్సీ నివేదించింది., విపత్తు అధికారులతో సమావేశం అనంతరం జపాన్‌ ప్రధానమంత్రి ఫుమియో కిషిడా మాట్లాడుతూ.. ‘భూకంపం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎన్నో భవనాలు కూలిపోయాయి. విపత్తు వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేశాము. విపత్తు బాధితులను రక్షించడానికి మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము.’ అని ఆయన అన్నారు. ఇక ఈ భూకంపం వల్ల వాజిమాలో ఏడు అంతస్తుల భవనం కూలిపోయినట్లు ఏరియల్‌ న్యూస్‌ ఫుటేజ్‌ చూపించింది. సహాయక చర్యలు మంగళవారం కూడా కొనసాగుతున్నాయని వాజిమా అగ్నిమాపక అధికారి తెలిపారు.జపాన్‌ భూకంపం.. సునామీ హెచ్చరికల ఉపసంహరణ

Also Read : ఆర్మీ జవాన్‌ మృతి.. రాష్ట్రానికి తిరిగి వద్దామనుకున్న లోపే

తీవ్ర భూకంపాల నేపథ్యంలో సోమవారం జారీ చేసిన సునామీ హెచ్చరికలను జపాన్‌ ఉపసంహరించుకుంది. అన్ని సునామీ హెచ్చరికలు, సూచనలు, సలహాలను ఎత్తివేసినట్టు జపాన్‌ వాతావరణ సంస్థ ‘ఇషిగావా’ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. కొత్త సంవత్సరం తొలి రోజున 7.6 తీవ్రతతో భారీ భూకంపం జపాన్‌ను కుదిపేసింది. కొన్ని తీర ప్రాంతాల్లో 5 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగసిపడ్డాయి. దీంతో జపాన్‌ ప్రభుత్వం హైఅలెర్ట్‌ ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని, ఎత్తైన భవంతులు ఎక్కాలని సూచించిన విషయం తెలిసిందే. సోమవారం మధ్య జపాన్‌లో సంభవించిన తీవ్ర భూకంపంలో కనీసం 13 మంది మరణించినట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇళ్లు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఒకచోట భారీ అగ్నిప్రమాదం జరిగిందని వివరించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube