ఇండ్ల ముందు టవర్ వేస్తే ఊరుకునేది లేదు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 6 వనపర్తి : వనపర్తి పట్టణంలో సోమవారం రోజు 30వ వార్డు సాయినగర్ కాలనీలోని వెనకవైపు జియో కంపెనీ టవర్ వేస్తుండగా కాలనీ వాసులతో కలిసి ప్రజలను చేసి ఆపివేయడం జరిగింది. అక్కడ ఉన్న జియో కంపెనీ వారిని పంపి వేస కాలనీ సభ్యులతో ఏకాభిప్రాయం కుదిరిం చుకొని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంత్రి మాట్లాడుతూ ఇల్లు ఉన్న దగ్గర టవర్ వేయకూడదని కలెక్టర్ గారికి ఎండార్స్మెంట్ చేశారు. వారికి మేమందరం ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్లి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇండ్ల ముందు టవర్లు వేస్తే ఊరుకునే లేదని ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జంగిడి సురేష్, శ్రీనివాసులు ,రాజేష్, ఈశ్వరమ్మ ,నరేష్, సతీష్, వెంకటయ్య, ఠాగూర్, బాలు, శివ, సత్యం, అనసూయ ,పుష్ప , శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

A group of people along with the colony residents were stopped on Monday in Vanaparthi Town.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube