32 కేజీల గంజాయిపట్టి వేత

32 కేజీల గంజాయిపట్టి వేత

1
TMedia (Telugu News) :

32 కేజీల గంజాయిపట్టి వేత

టీ మీడియా, మే 16, భద్రాచలం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్, ఐపీఎస్ సూచనల మేరకు, భద్రాచలం ఎస్పి రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం 04.00 లకు కూనవరం రోడ్, ఇసుక రాంప్ దగ్గర గంజాయి లావాదేవీల వ్యవహారం జరుగుతున్నదన్న పక్కా సమాచారంతో భద్రాచలం పట్టణ పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకోగా ఆటో , హోండా స్కూటీ వద్ద నల్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించగా వారినీ తనిఖీ చేయగా ప్రభుత్వ నిషేదిత గంజాయి 32 కేజీలు 2 బ్యాగ్ లలో ఉండటాన్ని గమనించినారు. వీరి వివరాలు తెలుసుకోగా చింతూరుకి చెందిన ఎస్ కె ఆలీ మరియు బత్తుల రత్న శేఖర్, యూపీ కి చెందిన సఫిక్ మరియు శేఖు లుగా తెలిసింది. వీరి వద్దనుండి 4 సెల్ ఫోన్లు స్వాధీన పరుచుకున్నరు.

Also Read : ఇంజనీరింగ్ కళాశాలల్లో అగ్రగామి ఖమ్మం ఎస్. బి. ఐ.టి.

దొరికిన గంజాయి విలువ 6,40,000/- రూపాయలు గా ఉండును. వీరు చింతూరు నుండి గంజాయి అక్రమంగా తీసుకువచ్చి వ్యాపారం చేస్తున్నారు.భద్రాచలం పట్టణ సరిహద్దులలో 24 గంటలు పోలీస్ తనిఖీలు జరుగుతుంటాయని, నిషేదిత వస్తువులు అయిన గంజాయి మరియు మరే యితర వస్తువులని తరలించిన వారిపై చట్టరీత్య చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగరాజు రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ మధు ప్రసాద్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. గంజాయిని పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన భద్రాచలం పోలీస్ సిబ్బందిని పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube