మూడు లక్షల పథకం ఎప్పుడు

మూడు లక్షల పథకం ఎప్పుడు

1
TMedia (Telugu News) :

మూడు లక్షల పథకం ఎప్పుడు

టీ మీడియా, జూలై 7, వనపర్తి బ్యూరో : సొంత జాగా ఉంటే మూడు లక్షలు డబ్బులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చింది. జూన్ లోపే అర్హుల ఎంపిక అని బడ్జెట్లో ప్రకటన కూడా చేశారు. జులై వచ్చిన మౌనం వీడి ఎలాంటి కార్యాచరణ చెప్పలేదు. ఆశలు పెట్టుకున్న పేదలు నిరాశ్రయులయ్యారు. సొంత గూడు లేని నిరుపేదలో నిరాశనిస్పృహలు అలుముకుంటున్నాయి. సొంత జాగ ఉండి ఇల్లు లేని పేదలకు గృహ నిర్మాణం కోసం మూడు లక్షల చొప్పున ఇస్తామని సర్కారు ఇచ్చిన అని అమలుకు నోచుకోకపోవడం హామీని గత బడ్జెట్లో సర్కారు పొందుపరిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు నెలలు ముగిసిన సర్కారులో కదలిక లేదు నిబంధనల రూపకల్పన లబ్ధిదారుల ఎంపిక దిశగా ఎలాంటి కార్యాచరణ మొదలు కాలేదు వాస్తవానికి ఈ హమీ నాలుగేళ్ల క్రితం పెట్టారు. సొంత ఇల్లు లేని పేదలకు సొంత స్థలం ఉంటే 2018 ఎన్నికల సందర్భంగా మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మూడు లక్షలకు కుదించారు. ఈ ఏడాది బడ్జెట్లో పొందుపరచిన తర్వాత జూన్ లోపు లబ్ధిదారుల ఎంపిక పూర్తవుతుందని కూడా ప్రభుత్వం ప్రకటించింది, అయితే ఈ గడువు ముగిసి జూలైలో వారం పూర్తయినా సర్కారు మౌనం వీడడం లేదు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పేదల సొంతింటి కళ నెరవేర్చేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇండ్లు పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ పథకంపై పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే దరఖాస్తుల సంఖ్య మేరకు ఇళ్ల నిర్మాణం జరగడం లేదు. నిర్మించిన ఇళ్లలోనూ చాలా మటుకు కేటాయించడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఒక లక్షా 13 వేల 535 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తే అందులో 17 వేల దాకా పంపిణీ చేసినట్టు చెబుతున్నారు.

 

Also Read : కాకతీయ సప్తహం ప్రారంభం

మిగతా 90 వేల పైచిలుకు ఇళ్ళ కోసం లబ్ధిదారుల జాబితాను సర్కార్ ప్రకటించడం లేదు. ఇండ్లను పంపిణీ చేయక స్థలం ఉన్న మూడు లక్షలు ఇవ్వకపోవడంతో సొంత ఇల్లు పై ఆశలు పెట్టుకున్న నిరుపేదలు ఆవేదన చెందుతున్నారు. కాగా మూడు లక్షల పథకంపై హామీల మార్గదర్శకాలకు సంబంధించి హౌసింగ్ అధికారులతో మంత్రి ప్రశాంత్ రెడ్డి రెండు సార్లు సమావేశం నిర్వహించారు. అధికారులతో సమాలోచనలు జరిపి నిబంధనలను రూపొందించారు. ఈ వివరాలను నివేదిక మంత్రి పంపినట్లు తెలిసింది. నిబంధనలపై సీఎంవో నుంచి అనుమతి వస్తేగానీ ముందడుగు పడదని నర్సింగ్ వర్గాల అభిప్రాయపడుతున్నాయి. కులాల వారిగా ఎంత మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలన్న దానిపై స్పష్టత ఇస్తే ప్రక్రియ మొదలవుతుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంలో సీఎం నుంచి ఎలాంటి స్పష్టత రాకపోవడంతో హౌసింగ్ అధికారుల్లో స్తబ్ధత నెలకొంది. ఏది ఏమైనా నా పేదలకు డబుల్ బెడ్రూమ్ గాని జాగ ఉండేవారికి 5 లక్షల రూపాయలు ఇస్తే బాగుంటుంది లేకుంటే ప్రజలపై అధికార పార్టీ అయిన వ్యతిరేకత ఏర్పడి వచ్చే ఎలక్షన్లలో ఓటమి చవిచూడాల్సి వస్తుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube