45 మద్యం బాటిళ్లు స్వాధీనం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 27, మహానంది:

మహానంది మండలం తమ్మడపల్లె గ్రామంలో మురారి అనే వ్యక్తివద్ద నుండి 45 మద్యం బాటిళ్లను ఎస్ ఈ బి సిఐ నాగమణి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నట్లు నంద్యాల ఎస్ ఈ బి ఎస్ ఐ కమలాకర్ పేర్కొన్నారు .నిందితునిపై కేసు నమోదు చేశామని కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. ఇదే క్రమంలో గత కొన్ని రోజులఇదే గ్రామంలో సారా విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్కు ఆదేశించినట్లు తెలిపారు.అక్రమ మద్యం నాటుసారా తయారీ విక్రయాలకు సంబంధించి సమాచారం అందజేయాలని వారి పేర్లు గోప్యంగా ఉంచి దాడులు నిర్వహిస్తామని ఎస్ ఐ కమలాకర్ పేర్కొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube