కనీస వసతలు లేని పాఠశాలలు

టి మీడియా,ఏప్రిల్ 16,వత్సవాయి

1
TMedia (Telugu News) :

కనీస వసతలు లేని పాఠశాలలు

టి మీడియా,ఏప్రిల్ 16,వత్సవాయి:కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ ఆధ్వర్యంలో వత్సవాయి మండలం కంభంపాడు గ్రామం లో గల బీసీ కాలనీ లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్ ని సందర్శించడం జరిగింది అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులను ఆ స్కూల్ పరిస్థితి ని అక్కడ వసతులు గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది దానికి బదులుగా ఉపాధ్యాయులు కనీస వసతలు పిల్లలకి కనీసం టాయలెట్స్ సౌకర్యం కూడా లేదని మరియు స్కూల్ కాంపౌండ్ వాల్ కూడా లేక ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు తెలియజేయడం జరిగింది అనంతరం జనసేన బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రతిష్టత్మకంగా తీసుకున్నామని చెప్పుకుంటున్న నాడు – నేడు కార్యక్రమం అని ప్రగల్బాలు పలుకుతున్న వై. సీ. పి ప్రభుత్వం ఎందుకు ఇటువంటి స్కూల్స్ కి నాడు – నేడు కార్యక్రమం ఎందుకు వర్తించటం లేదో చెప్పాలన్నారు అనంతరం విద్యార్థులతో పాటు కలిసి కూర్చొని మధ్యాహ్నణం భోజన మెనూ ను కూడా పరిశీలించడం జరిగింది అనంతరం మండల ఎడ్యుకేషన్ అధికారితో మాట్లాడి వీలైనంత త్వరగా స్కూల్ కి కనీస వసతలు కల్పించేవిధంగా చూడాలని మండల ఎడ్యుకేషన్ అధికారిని కోరడం జరిగింది ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

 

also read; నిప్పంటించుకున్న తల్లి, కొడుకు -ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube