48జీవో ని రద్దు చేయాలి

48జీవో ని రద్దు చేయాలి

1
TMedia (Telugu News) :

48జీవో ని రద్దు చేయాలి
టీ మీడియా ,మార్చి 12, అశ్వారావుపేట:మేజర్ గ్రామపంచాయితీ సిబ్బంది శనివారం స్థానిక కూడలి నందు ప్రభుత్వం ఇచ్చిన జీవో 48 ప్రతులను దగ్దం చేశారు.పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సెంటర్లో మరుగుదొడ్లు కడిగించే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి అని, జీవో నెంబర్ 48రద్దు చేయాలని గ్రామ పంచాయతీ జిల్లా కమిటీ సభ్యులు యం అప్పన్న డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా అప్పన్న మాట్లాడుతూ మల్టీ పర్పస్ విధానం తో పని భారం తో సతమతమవుతున్న సిబ్బంది తో మరుగుదొడ్లు కడిగించే జీవో తీసుకురావడం అన్యాయం అని అన్నారు.గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దే మాకు పీఆర్సీ వర్తింప చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు.గ్రామ పంచాయతీ సిబ్బంది కి ఉద్యోగ భద్రత కల్పించి పర్మినెంట్ చేయాలని, మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలని,పియఫ్,ఇఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి పిట్టల అర్జున్, కామేశ్వరరావు, నందు, నాగేంద్ర, నాగభూషణం నాగేశ్వరరావు నరసింహారావు,బుజ్జమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Also Read : అందుబాటులో 9,057 ఆర్టీసీ బ‌స్సులు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube