బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలి

బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలి

1
TMedia (Telugu News) :

బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలి

టీ మీడియా, జూన్ 17, వనపర్తి బ్యూరో : ఉదయపూర్ చింతన్ శిబిరంలో ఆల్ ఇండియా కాంగ్రెస్, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, గోపాల్ పేట జడ్పిటిసి అభ్యర్థి మురళి గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నేత గౌస్, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ లు గురువారం పాల్గొన్న పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగర్ ప్రసాద్ చెప్పారు.

Also Read : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చింతన్ శిబిరంలో జరిగిన నిర్ణయాలను మేమంతా స్వాగతిస్తున్నామని అందులో మా అధినాయకులు చేసిన తీర్మానాలను హర్శిస్తున్నామని మా అది నాయకులు చెప్పిన వార్డులో మేము నడుచుకుంటామని, వారు చెప్పిన ప్రకారం ప్రతి రాష్ట్రంలో బీసీలకు 50 శాతం సీట్లు ఇవ్వాలని, తెలంగాణలో కూడా ప్రతి జిల్లాలో 50 శాతం సీట్లు ఇవ్వాలని, దాని ప్రకారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తూ, నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రెండు ఎస్సీలకు ఫోను మిగతా ఆయిల్ సీట్లలో దామాషా ప్రకారం మూడు లేక నాలుగు సీట్లు బిసిలకు కేటాయించాలని, పార్టీ నిర్ణయాన్ని గౌరవిస్తామని, దాంట్లో భాగంగానే వనపర్తిలో కూడా బీసీలకు కేటాయించాలని, ఒకవేళ కేటాయిస్తే బీసీలు అత్యధిక మెజార్టీతో గెలుపు పొందు తారని, ఒకవేళ వనపర్తి సీటు ఎవరికి వచ్చినా కూడా మేమంతా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఇస్తామని ఈ సందర్భంగా వక్తలు చెప్పారు. ఈ సమావేశంలో సీనియర్ నాయకులు రాములు, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube