తనికెళ్ళ గ్రామంలో 52 అడుగుల ఏసు తిరు హృదయ స్వరూపం ప్రారంభోత్సవం

0
TMedia (Telugu News) :

ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఖమ్మం ఏలూరు విజయవాడ పీఠాధిపతులు

తనికెళ్ళ విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ కాక మాను రాజు

టీ మీడియా నవంబర్ 22: కొణిజర్ల

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామంలో 52 అడుగుల ఏసు తీరు హృదయ మహా స్వరూపాన్ని ప్రారంభోత్సవం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఖమ్మం పీఠాధిపతులు పాల్ మైపా న్, విజయవాడ పీఠాధిపతులు తెలగ తోటి రాజారావు, ఏలూరు పీఠాధిపతులు పొలిమేర రావు మరియు పలువురు గురువులచే మహా స్వరూప ప్రతిష్ట మహోత్సవం నిర్వహించడం జరిగింది. గత సంవత్సర కాలంగా ఫాదర్ రాజు మరియు తనికెళ్ళ విచారణ సంఘం ఎంతో కృషితో ఈ స్వరూపాన్ని ప్రతిష్టించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఖమ్మం పీఠాధిపతులు పాల్ మై ఫన్ మాట్లాడుతూ రాష్ట్రీయ రహదారి పక్కన ఏసు తీరు హృదయ స్వరూపం ప్రతిష్టించడం వచ్చేపోయే వారికి ఆ యొక్క ప్రభువు ఆశీస్సులు ఎల్లవేళలా సమస్త మానవాళిని కాపాడుతుందని తెలియజేశారు .ఈ కార్యక్రమంలో పలువురు గురువులు కన్య స్త్రీలు తనికెళ్ల గ్రామ సంఘం వివిధ గ్రామాల నుండి వచ్చిన విశ్వాసులు అధిక సంఖ్యలో పల్గునారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube