తెరాస 56 డివిజన్ బీసీ సెల్ సమావేశం టీ మీడియా, మార్చి11,ఖమ్మం

తెరాస 56 డివిజన్ బీసీ సెల్ సమావేశం టీ మీడియా, మార్చి11,ఖమ్మం

1
TMedia (Telugu News) :

తెరాస 56 డివిజన్ బీసీ సెల్ సమావేశం టీ మీడియా, మార్చి11,ఖమ్మం : తెరాస 56 డివిజన్ బీసీ సెల్ సమావేశం నిర్వహించడం జరిగినద కార్పొరేటర్ పైడిపల్లి రోహిణి సత్యనారాయణ డివిజన్ పార్టీ అధ్యక్షులు చెన్నబోయిన ఉదయ్ కుమార్ అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగింది.ఈ సమావేశంలో పార్టీ పట్టణ ,బీసీ సెల్ అధ్యక్షులు మేకల సుగుణారావు,బీసీ సెల్ పట్టణ ఉపాధ్యక్షులు మరియు వన్ టౌన్ అధ్యక్షులు గౌతమ్ బాబా,దూదేకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ కే భాష తదితరులు పాల్గొని ప్రసంగించారు.

also read:బాధిత కుటుంబాల కు నిత్యావసర సరుకులు

తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత కెసిఆర్ గారి నేతృత్వంలో బీసీ లు ఆర్థిక రాజకీయ సంక్షేమ రంగాల్లో ఎంతో అభివృద్ధి సాధించారని,గత పాలకులు కేవలం బీసీలను ఓటు బ్యాంక్ గా మాత్రమే చూసి వారి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని తెలియజేశారు..రాష్ట్రంలో బీసీ కులాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు mbc అనే ప్రత్యేక శా ఏర్పాటు చేసి వారి అభివృద్ధికోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించిన చరిత్ర తెరాస పార్టీకి ఉన్నదని తెలియ జేశారు..బీసీ లను విద్యాపరంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక గురుకుల పాఠశాలలు,కళాశాలలు ఏర్పాటు చేసిన చరిత్ర తెరాస పార్టీకి ఉన్నది..బీసీ కులాల్లో విద్యలో ప్రావీణ్యత సంపాదించిన విద్యార్థులకు 20లక్షల రూపాయలు ఇచ్చి విదేశీ చదువులు చదివిస్తున్న ఘనత తెరాస పార్టీది అని తెలియజేశారు..నాయి బ్రహ్మణ సోదరులకు సెలూన్స్ లో 250యూనిట్స్ వాడుకుంటే ఉచిత కరెంట్ ఇస్తున్న చరిత్ర తెరాస పార్టీది..చేపల చెరువులపై ముదిరాజ్ లకు హక్కు కల్పించి వారిని ఆడుకుంటున్న చరిత్ర తెరాస ది.

also read:దివ్యాంగుల స్వయం ఉపాధి కి ప్రభుత్వం చేయూతనివ్వాలి

రాజకీయంగా కూడా అనేక పదవుల్లో ప్రాధాన్యతను ఇస్తూ మన గౌరవ మంత్రి గారు బీసీ ల అభివృద్ధికి తోడ్పడుతున్నారు..జిల్లాలో అనేక కీలక పదవులు బీసీలకు ఇచ్చి బీసీ లని తన గుండెల్లో పెట్టుకుంటున్న నేత మన అజయ్ ఆన్న..రాబోవు ఎన్నికలను బీసీలు ఒక సవాల్ గా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది..బీసీ ల అభివృద్ధిని,సంక్షేమాన్ని కోరుకునే అజయ్ అన్నకు ఖమ్మం జిల్లా బీసీ సమాజం మొత్తం అండగా వుండాల్సిన సమయం ఆసన్నమైంది..

also read:కెసిఆర్ కోలుకోవాలని పూజలు

ప్రతి బీసీ బిడ్డ ఒక సైనికుడిగా పనిచేసి అజయ్ అన్నను లక్ష మెజారిటీ తో గెలిపించుకునీ బీసీల సత్తా చాటాలని బీసీనేతలు తమ సందేశాన్ని ఇచ్చారు..ఈ సమావేశంలో 56వ డివిజన్ బీసీ సెల్ అధ్యక్షులు, వేముల దుర్గారావు , మల్లికాంబ గంగసాని భానుప్రసాద్ పాల్గొన్నారు,,

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube