దేవాలయ భూమి పై ప(డ)గ

59 జిఓ అడ్డం పెట్టుకుని కార్పొరేటర్ కబ్జా

0
TMedia (Telugu News) :

దేవాలయ భూమి పై ప(డ)గ

– 59 జిఓ అడ్డం పెట్టుకుని కార్పొరేటర్ కబ్జా

– రూ. 32లక్షలకు రు 8.50 కోట్ల భూమి ఇచ్చిన అధికారులు

– రెగ్యూలైజేషన్ కోసం ఆధార్ కార్డు ట్యాంపరింగ్

– తప్పుడు నివాసం, ఇంటి నెంబర్ సృష్టి

టి మీడియా, డిసెంబర్ 21, ఖమ్మం బ్యూరో : ఖమ్మం నగరం లో భూ కబ్జా లు ఒక్కోకటి బైటకు వస్తున్నాయి. రు 8.50 కోట్లు విలువ చేసే భూమి ని రు 32 లక్షలకు 59 జీవో క్రింద అర్బన్ తహసీల్దార్ అక్రమంగా కార్పొ రెటర్ పగడాల శ్రీ విద్య కు రెగ్యులరలైజ్ రిజిస్టేషన్ చేశారు. అన్ని పరిశీలించ కుండా అధికారిక పని అని అందినంత తీసుకొని రిజిస్టేషన్ చేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీ విద్య బిఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షులు పగడాల నాగరాజు భార్య కావడం తో ఆసక్తికర చర్చ ఇలాంటి అక్రమ రిజిస్టేషన్ లు ఆ కుటుంబం మరికొన్ని చేయించుకొన్నట్లు తెలిసింది. టి మీడియా పరిశీలనలో ఆ భూమి ఎన్ఎస్పి, ప్రభుత్వం ది కాదు అని అక్కడి దేవాలయం ది గా తెలుస్తోంది. ఖమ్మం నూతన బస్టాండ్ సమీపంలో బైపాస్ ఆనుకుని ఈ భూమి ఉంది.

 

తప్పుడు ఫోటో, వివరాలు :
శ్రీవిద్య తాను భూరాన్ పురం పరిధి లోని ఎన్ఎస్పి క్యాంపు లోని సర్వే నెంబర్ 92 లోని ప్రభుత్వ భూమి 415 గజాలు లో ఇల్లు నిర్మాణం చేసుకొని ఉంటున్నా అని, మున్సిపల్ ఇంటి నెంబర్ 11-11-2o/6గా పేర్కొన్నారు.ఆ ఇంటి నెంబర్ పై ఆధార్ ఉన్నట్లు గా చూపించారు.. అర్బన్ తహసీల్దార్ అన్ని సక్రమంగా ఉన్నాయని ధ్రువీకరణ చేశారు. వాస్తవం గా ఆ నెంబర్ ఇల్లు మున్సిపల్ రికార్డు ల్లో బి. చిన్న గొపయ్య అనే అతని పేరున ఉంది. ఈ విషయం గురించి టి మీడియ బృందం క్షేత్ర స్థాయి సందర్శన చేయగా శ్రీ విద్య తన నివాస గృహంగా ఫోటో దిగిన నిర్మాణం అక్కడి రామాలయం కు చెందిన కళ్యాణ మండపం కు చెందినదిగా వెల్లడి అయింది.. దాని కి కొద్దీ దూరం లో ఉన్న భూమీ అక్రమ రెగ్యులైజేషన్ అనేది స్పష్టం అయింది.

Also Read : పోలీస్‌ వ్యవస్థ సమర్థవంతంగా పని చేయడంలో కీలక పాత్ర వహించాలి

ప్రొసీడింగ్ మరునాడు రిజిస్టేషన్ :
ఖమ్మం అర్బన్ తహసీల్దార్ 2023 సెప్టెంబర్ 26న శ్రీను విద్య ఇచ్చిన వివరాలు అన్ని కరెక్ట్ అని విచారణ లో తేలింది అని ప్రొసీడింగ్ ఫెల్ తయారు చేసారు. అదే ఏడాది మరునాడు సెప్టెంబర్ 27న శ్రీవిద్య కు హక్కులు కల్పిస్తూ రిజిస్టర్ చేయడం జరిగింది. నిబంధన ల ప్రకారం ప్రొసీడింగ్ ను ఆర్థివో ద్వారా కలేక్టర్ కు పంపి అనుమతి పొండాలి. శ్రీ విద్య విషయం లో అది జరిగిందా తెలియాలి. ఎన్ఎస్పి స్థలం అయితే ఆ శాఖ నుండీ ఎన్ఓసి కూడా తీసుకొవాలి.అది జరగలేదు అనేది తెలుస్తోంది. ఏ విధంగా ప్రభుత్వ భూమీ గా గుర్తించారు తెలియాలి.

ఆధార్ టాంపరింగ్ :
ఖానాపురం హవెలి, ఖమ్మం రూరల్ అని అడ్రెస్ ఉన్న పగడాల శ్రీ విద్య అక్రమరెగ్యులర్ కోసం ఆధార్ కార్డులో ఉన్న అడ్రెస్ వద్ద భూరాన్ పురం ఇంటి నెంబర్ 11-11-20/6 అని ఉన్న స్లిప్ పెట్టి జిరాక్స్ తీసి ఆ కాగితం ను రిజిస్టర్ కి ఇచ్చారు. నిబంధన ల ప్రకారం రిజిస్టర్ వర్జినల్ ఆధార్ తో జిరాక్స్ సరిపోల్చుకొవాలి అది జరగలేదు అనేది తెలిసింది. ఆధార్ అడ్రెస్ వద్ద “టు “అని ఇంగ్లిష్ లో ఉంది. తహసీల్దార్ కార్యలయం నుండీ శ్రీ విద్యకు వచ్చిన డబ్బులు చెల్లింపులు నోటిస్ లోని పై స్లిప్ చింపి టాంపరింగ్ కోసం వాడారు.అంటే అన్ని అక్రమాలు అర్బన్ తహసీల్దార్ కనుసన్నల్లో జరిగినట్లు తెలుస్తుంది.(మరికొన్ని 59 జిఓ అక్రమాలు మరో కధనం లో.. )

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube