6-12 ఏళ్ల వారికి కోవాగ్జిన్ -డీసీజీఐ కీల‌క అనుమ‌తులు

6-12 ఏళ్ల వారికి కోవాగ్జిన్ -డీసీజీఐ కీల‌క అనుమ‌తులు

0
TMedia (Telugu News) :

6-12 ఏళ్ల వారికి కోవాగ్జిన్ -డీసీజీఐ కీల‌క అనుమ‌తులు
టి మీడియా,ఏప్రిల్ 27, ఢిల్లీ :కోవిడ్ ఫోర్త్ వేవ్ వ‌స్తుందున్న ప్ర‌చారం నేప‌థ్యంలో డీసీజీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 6 నుంచి 12 ఏళ్ల లోపు వ‌య‌స్సు పిల్ల‌ల‌కు అత్య‌వ‌స‌ర వినియోగం కింద కోవాగ్జిన్ కు అనుమ‌తినిస్తూ నిర్ణ‌యం ప్ర‌క‌టించింది. కోవిడ్ నాలుగో వేవ్ ఉంటుంద‌ని తీవ్ర ప్ర‌చారం నేప‌థ్యంలో డీసీజీఐ తీసుకున్న ఈ నిర్ణ‌యానికి ప్రాధాన్యం ఏర్ప‌డింది.ఇక 2 ఏళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ ఇచ్చేందుకు అవ‌స‌ర‌మైన అద‌న‌పు డేటాను పంపాల‌ని డీసీజీఐ కోవ్యాగ్జిన్ నిపుణుల క‌మిటీని కోరింది. సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్ట్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్ నిపుణుల క‌మిటీ సూచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని, డీసీజీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది.12 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్ల‌ల కోసం కోవాగ్జిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి డీసీజీఐ గ‌త డిసెంబ‌ర్ 24న అనుమ‌తినిచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో పాటు 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్ డ్రైవ్ జ‌న‌వ‌రి 3 నుంచి ప్రారంభ‌మైంది. ఇక‌… దీంతో పాటు 5 -12 ఏళ్ల వారికి బ‌యోలాజిక‌ల్ ఈ సంస్థ త‌యారు చేసిన కార్బేవ్యాక్స్ టీకాను ఇచ్చేందుకు డీసీజీఐ అనుమ‌తినిచ్చింది

 

Also Read;పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube