24 నుంచి ఆరు రైళ్లు ర‌ద్దు

24 నుంచి ఆరు రైళ్లు ర‌ద్దు

1
TMedia (Telugu News) :

24 నుంచి ఆరు రైళ్లు ర‌ద్దు

టీ మీడియా,మే 6,హైద‌రాబాద్ : ఎటుమానూరు- కొట్టాయం- చింగవనం స్టేషన్ల మధ్య డబుల్‌ రైల్వే ట్రాక్‌ నిర్మాణ పనులు జరుగుతున్నందున సికింద్రాబాద్‌-తిరువనంతపురం మధ్య రెండు రైళ్లను మే 24 నుంచి 28 వరకు పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు గురువారం దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 6 నుంచి 17 వరకు మరో ఆరు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు-సూళ్లూరుపేట్‌, హెచ్‌ఎస్‌ నాందేడ్‌-సత్రగచీ స్టేషన్ల మధ్య నాలుగు రైళ్లను రద్దు చేశారు. దోన్‌ గుంటూరు స్టేషన్ల మధ్య రెండు రైళ్ల సమయాలను రీషెడ్యూల్‌ చేసినట్లు పేర్కొన్నారు.ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల నేప‌థ్యంలో.. నాలుగు ప్రత్యేక రైళ్లుఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ పరీక్షల నేప‌థ్యంలో ఈ నెల 8 నుంచి 10 వరకు శాలీమార్‌-చీరాల, హతియా-చీరాల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు, జబల్‌పూర్‌, నాందేడ్‌ స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు గురువారం రైల్వే అధికారులు తెలిపారు.

Also Read : అక్ర‌మ మైనింగ్ కేసు.. 18 ప్ర‌దేశాల్లో ఈడీ సోదాలు

హైదరాబాద్‌-జైపూర్‌ మధ్య 16 సమ్మర్‌ స్పెషల్‌ రైళ్లు
హైదరాబాద్‌-జైపూర్‌ స్టేషన్ల మధ్య 16 సమ్మర్‌ వీక్లి ప్రత్యేక రైళ్లను ఈ నెల 6 నుంచి జూన్‌ 26వ తేదీ వరకు నడుపనున్నట్లు రైల్వే జోన్‌ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎస్‌సీఆర్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube