69 జీవోను తక్షణమే రద్దు చేయాలి

69 జీవోను తక్షణమే రద్దు చేయాలి

1
TMedia (Telugu News) :

 

69 జీవోను తక్షణమే రద్దు చేయాలి

టీ మీడియా, ఆగస్టు 25, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో రాజీవ్ చౌక్ నందు గురువారం నీరసన తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉద్దేశించి విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు ముమ్మడి పరమేశ్వరాచారి మాట్లాడుతూ కార్పెంటర్ వృత్తి చేసుకొని జీవించే వారిపైన ఈనెల 5వ తారీఖు రోజున తెలంగాణ ప్రభుత్వం 69 జీవో తీసుకురావడం జరిగినది. ఈ జీవో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కార్పెంటర్ షాపులో ఉండే మిషనరీ,తోపుడు మిషన్, డ్రిల్ మిషన్ ,తొలి మిషన్ అన్ని కలుపుకొని 5 హెచ్పి కంటే కరెంటు ఎక్కువ వాడినట్లయితే డీఎఫ్ఓ వారి దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. పర్మిషన్తోపాటు నెల నెల కట్టేలెక్క చూయిస్తూ ఉండవలసి వస్తుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2016 సంవత్సరంలో కార్పెంటర్స్ కొరకు 55 జీవో తీసుకురావడం జరిగినది.

 

Also Read : సకుటుంబంగా చూస్తారు

ఈ జీవోను పక్కనపెట్టి ఇప్పుడు కొత్తగా తెచ్చిన 69 జీవో అమలు చేయాలని చూస్తున్నది. కానీ తక్షణమే 69 జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం గతంలో 2016 సంవత్సరంలో ఇచ్చినటువంటి 55జీవో తక్షణమే అమలు చేయాలని 69 జీవో ను తక్షణమే రద్దు చేయాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించడమైనది. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కౌన్సిలర్ పి బ్రహ్మచారి, కార్పెంటర్ సంఘం అధ్యక్షులు కృష్ణమాచారి, సెక్రటరీ రఘు ఆచారి, వి. మనయాచారి, శేఖరా చారి, విష్ణు ఆచారి, డి రాము ఆచారి, ఐక్య సంఘం టౌన్ అధ్యక్షులు వెంకటాచారి, వి . చెన్నయ్య ఆచారి, నరసింహ చారి, మన్నన్ భాష భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube