6న సీఎల్పీ సమావేశం

టీ మీడియా,మార్చి 5

0
TMedia (Telugu News) :

6న సీఎల్పీ సమావేశం టీ మీడియా,మార్చి 5 , గాంధీభవన్‌: కాంగ్రెస్‌ శాసనసభాపక్ష (సీఎల్పీ) సమావేశం ఆదివారంజరగనుంది. సీఎల్పీ నేత భట్టివిక్రమార్క అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ సీఎల్పీ నేతలు, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు, పీసీసీ అనుబంధ సంఘాల అధ్యక్షులు హాజరుకానున్నారు. రైతులు, నిరుద్యోగ సమస్యలే ప్రధాన ఎజెండాగా సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. గతానికి భిన్నంగా ఈసారి ప్రతి నియోజకవర్గం నుంచి సమస్యలు తెలుసుకొని వాటిని సభలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారానికి ఒత్తిడి తెచ్చేలా కార్యచరణ రూపొందించనున్నారు. సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube