8 జిల్లాల్లో కొత్త మెడికల్ కాలేజీలు: మంత్రి హరీశ్ రావు
టి మీడియా,మార్చి 7,హైదరాబాద్: రాష్ట్రంలో మరో ఎనిమిది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇప్పటికే 17 మెడికల్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, వచ్చే ఏడాది కొత్తగా మరో ఎనిమిది జిల్లాల్లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. నూతన కాలేజీల ఏర్పాటుకు 2022-23 వార్షిక బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీలో 2022-23 వార్షిక బడ్జెట్ను మంత్రి హరీశ్ రావు శాసన సభలో ప్రవేశపెట్టారు.రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం నల్లగొండ, సిద్దిపేట, మహబూబ్నగర్, సూర్యాపేటలో మెడికల్ కాలేజీలను ప్రారంభించిందని చెప్పారు. l
also read:*డస్ట్ పేరుతో ఇసుక రవాణా*
వీటిలో పీజీ కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం కొనసాగుతున్నదని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కాలేజీల్లో బోధన ప్రారంభమవుతుందన్నారు.మిగిలిన ఎనిమిది జిల్లాలైన మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, ములుగు, వరంగల్, నారాయణపేట, గద్వాల, యాద్రాద్రి జిల్లాల్లో వచ్చే ఏడాది మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు.: మంత్రి హరీశ్ రావు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube