24 గంటల్లో 9 మంది నవజాత శిశువులు మృతి

24 గంటల్లో 9 మంది నవజాత శిశువులు మృతి

0
TMedia (Telugu News) :

24 గంటల్లో 9 మంది నవజాత శిశువులు మృతి

– విచారణకు ఆదేశం

టీ మీడియా, డిసెంబర్ 8, కోల్‌కతా : పశ్చిమబెంగాల్‌లో 24 గంటల్లో రెండేళ్ల చిన్నారి సహా 9 మంది నవజాత శిశువులు మృతి కలకలం సృష్టిస్తోంది. ముర్షిదాబాద్‌ మెడికల్‌ కాలేజీ మరియు ఆస్పత్రిలో జరిగిన ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు శుక్రవారం ఓ అధికారి తెలిపారు. నవజాత శిశువుల్లో ఎక్కువమంది పోషకాహార లోపం, పుట్టుకతో వచ్చే వ్యాధులు మరియు 500 లేదా 600 గ్రాముల తక్కువ బరువుతో ఉన్నారని, దీంతో వారిని రక్షించలేకపోయామని ముర్షిదాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ మరియు వైస్‌ ప్రిన్సిపల్‌ అమిత్‌ కుమార్‌ దాహ్ తెలిపారు. ఇటువంటి సందర్భాలలో నిర్ణీత సమయానికి చికిత్స అందాల్సి వుందని, కానీ అప్పటికే సమయం మించిపోయిందని అన్నారు. జంగీపూర్‌ సబ్‌-డివిజనల్‌ హాస్పిటల్‌ పునరుద్ధరణలో ఉండటంతో వారి కేసులన్నింటినీ ముర్షిదాబాద్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌కు వెళ్లాల్సిందిగా సూచిస్తున్నారని దాహ్ తెలిపారు. జంగీపూర్‌ నుండి ఇక్కడికి తీసుకురావడంతో చికిత్సకు ఐదు గంటల ఆలస్యమైందని పేర్కొన్నారు.

Also Read : బాధితుల్లో ప్రతీ ఇంటికి రూ.2,500 ఇచ్చాం.. నష్టం జరగనివ్వం’

ఇతర జిల్లాల నుండి వచ్చే రోగులను చేర్చుకోవడంతో .. 300 రోగులకు కేవలం 130 పడకలు మాత్రమే ఉన్నాయని అన్నారు. ఇటీవల మహారాష్ట్రలోనూ ఇదే తరహా ఘటనలు చోటుచేసుకున్నాయి. అక్టోబర్‌ నెల మొదటి వారంలో నాన్దేడ్‌ ఆస్పత్రిలో 24 గంటల్లో 12 నవజాత శిశువులు సహా 24 మంది మరణి. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube