పూరీ మఠంలోరూ.90 కోట్ల వెండి లభ్యం..

1
TMedia (Telugu News) :

పూరీ మఠంలోరూ.90 కోట్ల వెండి లభ్యం..

-18 టన్నుల 522 వెండి ఇటుకలు స్వాధీనం..

టీ మీడియా, మార్చి11,ఒడిశా: పూరీ పుణ్యక్షేత్రంలో శనివారం భారీ స్థాయిలో వెండి నిల్వలు బయటపడ్డాయి.

శ్రీజగన్నాథస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఎమ్మార్ మఠంలో కొన్ని దశాబ్దాలుగా ఉపయోగించని గది నుంచి నాలుగు చెక్కపెట్టెల్లో 522 వెండి ఇటుకలు లభ్యమయ్యాయి.

also read:వేములవాడ రాజన్న కు బంగారు రుద్రాక్షమాల

 

ఒక్కోటీ 38 నుంచి 40 కేజీల బరువుండే ఈ వెండి ఇటుకల ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 90 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే వీటి మొత్తం బరువు 18 టన్నుల 87 కిలోల 650 గ్రాములుగా లెక్కగట్టారు.

చోరీ చేసిన కొన్ని వెండి ఇటుకలను విక్రయించేందుకు ప్రయత్నించిన బారల్, దాస్ అనే ఇద్దరు తాపీమేస్ర్తీల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ నిల్వ రహస్యాన్ని ఛేదించారు.

 

also read:విద్యార్థులకు సోలార్ ద్వీపం పంపిణీ

మఠం మరమ్మతు పనుల కోసం ఒడిశా రాష్ట్ర పురావస్తుశాఖ విభాగం వీరిని ఇటీవల నియమించినట్లు పోలీసులు తెలిపారు.

మఠంలోని వెండి నిల్వలున్న గదిలో మేస్త్రీలు సీలింగ్ పనులు జరుపుతుం డగా సిమెంటు పెళ్లలు ఊడి కిందున్న ఓ చెక్కపెట్టెపై పడి అది విరిగిందని, దీంతో అందులోంచి కొన్ని వెండి ఇటుకలను బయటకు తీసి విక్రయించాలనుకున్నట్లు నిందితులు తమ విచారరణ లో వెల్లడించినట్లు సమాచారం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube