టీ మీడియా, డిసెంబర్, 24, భద్రాచలం
భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని 38 మంది బిజీ ప్రధానోపాధ్యాయులు మల్టీ జోన్ లోకి వెళ్లాల్సి ఉంది. హెచ్ డబ్ల్యూఓ గ్రేడ్ -1 కింద నలుగురు ఉండగా గ్రేడ్-2 లో 45 మంది విధులు నిర్వహిస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్లు ఐదుగురు తో పాటు సూపరింటెండెంట్ స్థాయిలో ముగ్గురు పని చేస్తున్నారు. వీరంతా జోనల్ పోస్టుల్లోకి వెళ్తారు. ఇందులో ఎవరు ఎక్కడ ఉంటారో అధికారికంగా నివేదిక వెల్లడి కావాల్సి ఉంది. స్థానిక ప్రాంతాలకే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నట్లు తెలిసింది.
భార్యాభర్తల్లో ఒకరు ఎస్జిటిగా ఉండి మరొకరు పి జి హెచ్ ఎం గా ఉంటే ఇలాంటి వారిపట్ల కౌన్సిలింగ్ తరుణంలో సానుకూల వైఖరి చాటే వీలుందని అంటున్నారు. డి డి కార్యాలయంలోని స్థాన చలనాలు కలిగే పరిస్థితులు నెలకొన్నాయి. సీనియర్ ఉద్యోగులు ఎక్కువగా ఉన్నప్పటికీ మిగతా జిల్లాల నుంచి సూపర్ సీనియర్లు ఉంటే కదలిక తప్పదని భావిస్తున్నారు. ముందుగానే తమ స్థానాలు తెలియడంతో విద్యా సంవత్సరంలో ఫలితాలు సాధనకు ఎలా కృషి చేస్తారు అన్నది తేలాల్సి ఉంది. అంతా పారదర్శకంగా సాగుతుందని డిడి రమాదేవి తెలిపారు.