సిద్ధ‌రామ‌య్య‌పై బ‌యోపిక్ : టైటిల్ రోల్‌లో విజ‌య్ సేతుప‌తి

సిద్ధ‌రామ‌య్య‌పై బ‌యోపిక్ : టైటిల్ రోల్‌లో విజ‌య్ సేతుప‌తి

1
TMedia (Telugu News) :

సిద్ధ‌రామ‌య్య‌పై బ‌యోపిక్ : టైటిల్ రోల్‌లో విజ‌య్ సేతుప‌తి

టీ మీడియా, నవంబర్ 30, బెంగ‌ళూర్ : క‌ర్నాట‌క మాజీ సీఎం, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత సిద్ధ‌రామ‌య్య‌పై బ‌యోపిక్ నిర్మించేందుకు స‌న్నాహాలు ఊపందుకున్నాయి. సిద్ధ‌రామ‌య్య పాత్ర‌లో క‌నిపించేందుకు త‌మిళ న‌టుడు విజ‌య్ సేతుప‌తిని మేకర్స్ సంప్ర‌దించిన‌ట్టు స‌మాచారం. త‌న బ‌యోపిక్ ప్రాజెక్టుకు 75 ఏండ్ల‌ సిద్ధ‌రామ‌య్య అధికారికంగా గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వాల్సి ఉంది. సీనియ‌ర్ కాంగ్రెస్ నేత‌పై బ‌యోపిక్ నిర్మించేందుకు ఆయ‌న మ‌ద్ద‌తుదారులు, అభిమానులు స‌న్న‌ద్ధ‌మ‌య్యారు. మ‌రోవైపు త‌న బ‌యోపిక్‌లో తాను న‌టించ‌డం లేద‌ని సిద్ధ‌రామ‌య్య స్ప‌ష్టం చేసిన‌ట్టు తెలిసింది.

Also read : పోలియో టీకా సెంటర్‌ వద్ద బాంబు పేలుడు

అయితే త‌న బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు ఆయ‌న వ‌చ్చే వారం త‌న స‌మ్మ‌తిని తెలియ‌చేస్తార‌ని సిద్ధ‌రామ‌య్య మ‌ద్ద‌తుదారులు చెబుతున్నారు. మ‌రోవైపు విజ‌య్ సేతుప‌తి పోలీస్ పాత్ర‌లో క‌నిపించే డీఎస్‌పీ మూవీ అఫిషియ‌ల్ ట్రైల‌ర్ ఇటీవ‌ల రిలీజై సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube