కాలువ‌లో ప‌డిపోయిన కారు : ఐదుగురు మృతి

కాలువ‌లో ప‌డిపోయిన కారు : ఐదుగురు మృతి

0
TMedia (Telugu News) :

కాలువ‌లో ప‌డిపోయిన కారు : ఐదుగురు మృతి

టీ మీడియా, నవంబర్ 8, బెంగ‌ళూర్ : క‌ర్నాట‌కలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. మాండ్య జిల్లాలోని పాండ‌వ‌పుర స‌మీపంలోని కాలువ‌లో కారు ప‌డిపోవ‌డంతో వాహ‌నంలో ప్ర‌యాణి్స్తున్న ఐదుగురు మ‌ర‌ణించారు. విశ్వేశ్వ‌ర‌య్య కాలువ‌లో బుధ‌వారం కారు ప‌డిపోవ‌డంతో ఐదుగురు వ్య‌క్తులు మ‌ర‌ణించార‌ని పోలీసులు తెలిపారు. ఘ‌ట‌నా స్ధ‌లానికి చేరుకున్న స‌హాయ సిబ్బంది కాలువ నుంచి మృత‌దేహాల‌ను వెలికితీశారు. మృతులంద‌రూ తుముకూరు జిల్లాలోని తిప్తూర్‌కు చెందిన వార‌ని పోలీసులు వెల్ల‌డించారు. మైసూర్‌లో జ‌రిగిన ఓ ఫంక్ష‌న్‌లో పాల్గొని తిరిగివ‌స్తుండ‌గా వారు ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాద‌వ‌శాత్తూ కాలువ‌లో ప‌డిపోయింది. బాధితుల స్వ‌స్ధ‌లం తుముకూరు జిల్లాలోని తిప‌తూర్ కాగా, వారంతా ప్ర‌స్తుతం భ‌ద్రావ‌తిలో నివ‌సిస్తున్నార‌ని పోలీసులు తెలిపారు.

Also Read ; కేరళలో పోలీసులు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు.!

మృతుల‌ను చంద్ర‌ప్ప‌, కృష్ణ‌ప్ప‌, ధ‌నుంజ‌య్‌, బాబు, జ‌య‌న్న‌గా గుర్తించారు. ఘ‌ట‌న‌కు సంబంధించి బాధితుల కుటుంబ‌స‌భ్యుల‌కు స‌మాచారం అందించామ‌ని, మృతులంతా బంధువుల‌ని వెల్ల‌డైంద‌ని పోలీసులు చెప్పారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube