ప్రేమ పెళ్లికి సహకరించాలని కోరిన జంట

నాకేంటి’ అని ప్రశ్నించిన ఎస్సై

1
TMedia (Telugu News) :

ప్రేమ పెళ్లికి సహకరించాలని కోరిన జంట.. ‘

-నాకేంటి’ అని ప్రశ్నించిన ఎస్సై

టి మీడియా, జూలై 22,కర్నూలు :

ప్రేమ జంటకు అండగా ఉండాల్సిన పోలీస్ అధికారి ట్రాక్ తప్పాడు. నాకెంత లంచం ఎంత ఇస్తారని ముఖం మీదే అడిగేశాడు. దీంతో ఆ జంట ఉన్నతాధికారుల వద్దకు వెళ్లి గోడు వెళ్లబోసుకుంది.

_ప్రేమ పెళ్లికి సహకరించాలని కోరిన జంట నుంచి 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ సమీర్ భాషా పై ఎట్టకేలకు వేటు పడింది. 10000 లంచం తీసుకున్నట్లు.. మిగతా డబ్బు కోసం డిమాండ్ చేసినట్లు ఆధారాలతో సహా రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు జిల్లా తుగ్గలి ఎస్సై సమీర్ భాషను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆదేశాలు జారీ చేశారు. కర్నూలు జిల్లా మద్దికేరకు చెందిన క్రాంతి కుమార్, ప్రీతి ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఎస్ఐ సమీర్ భాషను ఆశ్రయించారు.

 

Aolso Read : కాల్ గర్ల్స్ పంపుతా అనే మోసగాడు అరెస్ట్

తనకు 50 వేలు లంచం ఇస్తే ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సరే ఇస్తామని చెప్పారు జంట. ఇందుకు రాజు అనే వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకున్నాడు ఎస్సై. మొదట రాజు పదివేల రూపాయలు ఎస్ఐ చెప్పిన నెంబర్కు ఫోన్ పే చేశాడు. మిగిలిన డబ్బులు ఇప్పిస్తావా లేదా అంటూ ఒత్తిడి చేశాడు. బెదిరింపులకు దిగాడు. దీంతో భరించలేక రాజు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఆ రోజే ఎస్సై భాషా అని విఆర్ కు పిలిపించారు. విచారణ కూడా కొనసాగుతుందని చెప్పారు. ఆ తర్వాత విచారించిన స్పెషల్ బ్రాంచ్ అధికారులు డబ్బులు తీసుకున్నది.. మిగతా డబ్బుల కోసం బెదిరించినది అన్ని ఆధారాలు సేకరించారు. ఎస్సైపై ఆరోపణలు నిజమని తేలడంతో గురువారం జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఎస్సై సమీర్ భాషా ని సస్పెండ్ చేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube