ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

0
TMedia (Telugu News) :

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.

-22 సంవత్సరాల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు.

టీ మీడియా ,ఆగస్టు 6,తిరుమలాయపాలెం:

 మండలంలోని కాకరవాయి ప్రభుత్వ పాఠశాలలో 2000-2001 పదవ తరగతి పూర్వ విద్యార్ధులు ఆత్మీయ సమ్మేళనం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆదివారం కాకరవాయి గ్రామం లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అప్పటి ఉపాధ్యాయులైన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలలో చదివి 22 ఏళ్లు అవుతున్నా. గత స్మృతులను గుర్తుంచుకొని పాఠశాలలో సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా వివిధ వృత్తులలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలలో, వివిధ వృత్తులలో స్థిరపడిన పూర్వ విద్యార్ధులు తమ గత స్తృతులను నెమరువేసుకున్నారు. తమ వయస్సును మరిచి నృత్యాలు చేశారు. పాటలు పాడారు. తాము చదువుకున్న పాఠశాలలో కలియతిరిగి తమ అనుబంధాలను స్మరించుకున్నారు. 

 

alsoread :పవర్ (మేక్) న మజాకా

తమ కుటుంబ నేపథ్యాలను, కష్టసుఖాలను పంచుకున్నారు. పూర్వ విద్యార్థులలో ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇబ్బందులలో ఉన్న మిత్రులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించుకున్నారు. అనంతరం పూర్వ ఉపాధ్యాయులకు విద్యార్థులు శాలువలతో ఘనంగా సన్మానించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube