గురు స్వామికి ఘన సన్మానం

గురు స్వామికి ఘన సన్మానం

1
TMedia (Telugu News) :

గురు స్వామికి ఘన సన్మానం

 

టీ మీడియా, డిసెంబర్ 3, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రావణ్ గురు స్వామిని ఘనంగా సన్మానించిన మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ గోపాల్పేట మండలం తార్పర్తి గ్రామానికి చెందిన శ్రావణ్ గురు స్వామి 18వ పడి నారీకీల గురుస్వామి అయిన సందర్భంగా 18వ సారి శబరి యాత్ర చేస్తున్న శ్రావణ్ గురుస్వామిని వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ముత్తు కృష్ణ గురుస్వామి శిష్య బృందం ఘనంగా సన్మానించారు. అయ్యప్ప స్వాములు వందలాదిమంది తాడిపర్తిలో జరిగిన అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమంలో పాల్గొని అత్యంత భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి అంగపూజ అభిషేకం అష్టోత్తరం బ్రహ్మోపదేశం భజన కార్యక్రమాలు నిర్వహించారు.

 

Also Read : పార్కు ఏర్పాటుకు భూమి పూజ

 

ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ ముత్తుకృష్ణ గురుస్వామి ప్రధాన శిష్యుడైనటువంటి శ్రవణ్ గురుస్వామి 18వ సారి యాత్ర చేయడం గొప్ప విషయమని గోపాల్పేట మండలంలో ఆధ్యాత్మికతను పెంపొందించడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని ఎంతోమంది అయ్యప్పలను మాలవేసిన ఘనత శ్రావణ్ గురుస్వామి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాగితాల లక్ష్మీనారాయణ గురుస్వామి, వెంకన్న గురుస్వామి, బాల్రెడ్డి గురుస్వామి, పోతుల రాము, బీచ్పల్లి యాదవ్ గురు స్వాములు, బాల్ రెడ్డి, ఈశ్వర్, నందిమల్ల అశోక్, రామకృష్ణారెడ్డి, అంకుర్ విష్ణువర్ధన్ రెడ్డి, నక్క రాములు, ప్రకాష్, కళ్యాణ్, శివ గురుస్వాములు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube