ఆవును చంపిన చిరుత

ఆవును చంపిన చిరుత

1
TMedia (Telugu News) :

ఆవును చంపిన చిరుత
టీ మీడియా,జూలై 2,చిత్తూరు : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలో క్రూర జంతువుల సంచారంతో గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. నిన్న,మొన్నటి వరకు కాకినాడ, అనకాపల్లి జిల్లాలో నెలరోజులుగా గ్రామస్థులకు, అటవీశాఖ అధికారులకు ఓ పులి ముచ్చెమటలు పట్టిస్తుంది. దాని జాడను కనుక్కొవడానికి, దానిని పట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ విఫలమవుతున్నారు.

Also Read : ఇన్నోవేషన్‌ సెంటర్‌.. భూమిపూజ చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

తాజాగా చిత్తూరు మండలం వి.కోట మండలం నాయకనేరి గ్రామంలో చిట్టిబాబు అనే రైతుకు చెందిన ఆవును చిరుతపులి చంపివేసింది.సమాచారం అందుకున్న సంబంధిత అధికారులు గ్రామానికి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆవును చిరుతే చంపిందని ధ్రువీకరించారు. స్థానికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube