శ్రీవారి భక్తులకు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

శ్రీవారి భక్తులకు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

1
TMedia (Telugu News) :

శ్రీవారి భక్తులకు తృటిలో తప్పిన ఘోర ప్రమాదం
టి మీడియా,జూలై 13,తిరుపతి : తిరుపతి జిల్లా చంద్రగిరి వద్ద శ్రీవారి భక్తులకు ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. జాతీయరహదారిపై కారు దగ్ధమైన ఘటన నుంచి ఆరుగురు భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. తిరుమల నుంచి వేలూరు వెళ్తుండగా కారు ఇంజిన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చూసిన భక్తులు వెంటనే కారు నుంచి దిగి తమ ప్రాణాలను రక్షించుకున్నారు.

Also Read : కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతిపై సీఎం కేసీఆర్‌

అదే విధంగా గుంటూరు జిల్లా నల్లపాడు వద్ద లారీలో మంటలు చెలరేగాయి. డ్రైవర్‌, క్లీనర్‌ వెంటనే లారీ నుంచి కిందికి దిగి ప్రాణాలను కాపాడుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని లారీ మంటలను ఆర్పివేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube