వక్రబుద్ధి ఉపాధ్యాయుడు

-పసి మొగ్గలపై పైశాచిక ఆనందం

0
TMedia (Telugu News) :

వక్రబుద్ధి ఉపాధ్యాయుడు

-పసి మొగ్గలపై పైశాచిక ఆనందం

టీ మీడియా,అక్టోబర్ 30 అశ్వరావుపేట : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు వక్రబుద్ధి ప్రదర్శించాడు. నాలుగో తరగతి చదువుతున్న బాల బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు.మండలం లోని ఊట్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాల లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్థులు తెలిపిన వివరాలు ప్రకారం విద్యార్థిని విద్యార్థులు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి,మూడో తరగతి చదువుతున్నారని.

మొన్న శనివారం మధ్యాహ్నం పాఠశాలలో పిల్లలు ఆడుకుంటుండగా కొంత మందిని తన గదిలోకి పిలిచి ఎక్కాలు వ్రాయమని ఒక్కో విద్యార్థినిని దగ్గరకు పిలిచి మాట్లాడుతూ నిలిచోపెట్టి ఆడపిల్ల ల వస్త్రాలను మగపిల్లలతో,మగ పిల్లల వస్త్రాలను అడపిల్లలతో తొలిగించి పైశాచిక ఆనందం పొందాడు అని బట్టలు తీసిన తర్వాత తన సెల్ ఫోన్ తో ఫోటోలు కూడా తీసాడని పిల్లలు వారి తల్లిదండ్రుల తో చెప్పటం తో తల్లిదండ్రులు ఆగ్రహావేశాలతో సోమవారం పాఠశాలకు చేరుకున్నారు.పాఠశాల లో ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఆందోళన నిర్వహించారు. పిల్లలతో ఈ ఉపాధ్యాయుడు వెట్టిచాకిరి చేయిస్తున్నాడని పాఠశాల శుభ్రం చేయటం మంచినీళ్లు పట్టడం పిల్లలతోనే చేయిస్తాడని ఉపాధ్యాయుడు నిత్యం మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నాడని ఎక్కడో సుదీర్ఘ ప్రాంతం నుంచి ఆలస్యంగా పాఠశాలకు వస్తాడని వారు తెలుపుతున్నారు.

Also Read : మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తాం

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని తల్లిదండ్రులకు సర్ది చెప్పటం తో ఆందోళన విరమించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఉపాధ్యాయుడిపై ఫిర్యాదు చేశారు.స్థానిక సర్పంచ్ మీడియా పూర్వకంగా పిల్లల్ని అడుగగా పిల్లలు చెప్పిన మాటలకు అక్కడివారు నివ్వెరపోయారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube