పురుగుల మందు తాగిన రైతులు

పురుగుల మందు తాగిన రైతులు

1
TMedia (Telugu News) :

పురుగుల మందు తాగిన రైతులు

టీమీడియా, ఆగస్టు27, అమరావతి : చిత్తూరు జిల్లాలోని మల్లవల్లి రైతులు భూములకు పరిహారం అందలేదని పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. తమను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ 10 మంది రైతులు పురుగుల మందు తాగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రాజు అనే రైతు పురుగుల మందు తాగి స్పృహ కోల్పోగా అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు.

Also Read : గులాం నబీ ఆజాద్ క‌శ్మీర్ సీఎం అవుతారు

మల్లవల్లి ఇండిస్ట్రియల్‌ కారిడార్‌కు రైతులు భూములివ్వగా పరిహారాన్ని ఇప్పటి వరకు అధికారులు అందించలేదు. ఆరేళ్లక్రితం భూములిచ్చినా ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని ఆరోపిస్తూ ఆందోళన నిర్వహిస్తున్నారు. 650 మంది రైతుల నుంచి 2,460 ఎకరాల భూములను ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధి కోసం తీసుకుంది. అయితే 500 మంది రైతులకు పరిహారం అందించగా మరో 150 మంది రైతులకు చెల్లించలేదు. తమ భూములను తీసుకుని తమపై కేసులు నమోదు చేయడాన్ని నిరసనగా రైతులు పోలీస్‌ స్టేషన్‌కు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube