బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం

బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం

1
TMedia (Telugu News) :

బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో బీసీల ఆత్మీయ సమ్మేళనం

 

టీ మీడియా, నవంబర్ 18, వనపర్తి బ్యూరో : దేవరకద్ర నియోజకవర్గ అడ్డాకుల మండలంలో బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో అడ్డాకుల మండల బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు ఈ సమ్మేళనానికి అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో 60 శాతం పైగా ఉన్న బీసీలు, చట్టసభల్లో 10 శాతం కూడా లేకపోవడం శోచనీయమని, కనుక వెంటనే బీసీలు మేలుకొని ఏకమై పది పదిహేను శాతం ఉన్న ఆగ్రవర్ణాలు ఏలుతున్న ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని సంఘటితం చేసి దామాషా ప్రకారం మన హక్కులు మనమే సాధించుకొని మన సీట్లను మనమే సాధించుకోవాలని ఈ సందర్భంగా చెప్పారు.అంతేకాకుండా మనతో పాటు ఎస్సీ ఎస్టీల మైనార్టీలను కలుపుకొని రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడారు.

 

Also Read : తాజ్ బాబా సేవాసమితి ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ

 

వనపర్తి నియోజకవర్గంలోని వనపర్తి పట్టణ మున్సిపాలిటీలో రెండు కులాలు కలిస్తేనే ఒక చైర్మన్ సీటు సాధించే సీట్లు సంపాదించారని, ఒక మూడు కులాలు కలిస్తే ప్రతి నియొజకవర్గంలో ఎమ్మెల్యే సీటు బీసీలే గెలుస్తారని దాన్నిబట్టి బీసీలే రాజ్యాధికారం చేపడతారని దీన్ని చూసైనా బీసీలు మారి ఏకం కావాలని ఈ సందర్భంగా అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు.రాబోయే రోజుల్లో ఉమ్మడి జిల్లాలో అన్ని మండలాలలో బీసీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాుచేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది.సమావేశంలో బీసీ టైమ్స్ అధినేత సూర్యరావుతో పాటు దేవరకద్ర నియోజకవర్గం నాయకులు బాబన్న, బుచ్చన్న యాదవ్, మండల నాయకులు దేవరకద్ర నాయకులు వనపర్తి అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు వెంకటేశ్వర్లు, జనంపెట రాములు, అడ్వకేట్ ఆంజనేయులు, పొట్టినేని గోపాలకృష్ణ, రమేష్ పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube